తెలంగాణ

వెబ్‌సైట్‌తో అపోహలు తొలగిపోతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: వెబ్‌సైట్‌తో అపోహలు తొలగిపోతాయని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ‘మన తెలంగాణ... మన దత్తన్న’ పేరిట దత్తాత్రేయ అభిమాని భారతి రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, రాజస్థాన్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ ఎపి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాల గురించి ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. కేంద్రం రూ పొందించిన గ్రామ, గ్రామానికి విద్యు త్తు పథకానికి తెలంగాణ ఎంపికైందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభు త్వం చేపడుతున్న పథకాలను ఇందు లో పొందుపొరచడం ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ నిధులు కేటాయించారని లేదా తెలంగాణకు తక్కువ కేటాయించి, ఆంధ్రకు ఎక్కువ నిధులు కేటాయించారన్న అపోహలు లేకుం డా ఈ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన ఉదహరించారు. పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైనా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలూ ఇందులో ఉంటాయని ఆయన తెలిపారు. డిజిటల్ ఇండి యా, ముద్ర బ్యాంకుల తదితర వాటి గురించి ఉంటాయని చెప్పారు.

బంగారు తెలంగాణలో
ప్రలోభాలు ఎందుకు?
ప్రశ్నించిన ఎంపి విహెచ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: బంగారు తెలంగాణ సాధించాలనుకున్నప్పుడు ఇతర పార్టీల నుంచి నాయకులను ప్రలోభపెట్టి, భయపెట్టి టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ఎందుకని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావుప్రశ్నించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్‌లో చేరుతున్న తమ పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ అక్కడ ఉండదనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తమపార్టీ నుంచి వెళ్ళిన కెకె, డిఎస్ ఎలా వౌనంగా ఉండిపోయారో గమనించాలని ఆయన సూచించారు.

మరో ఐదు గెలుస్తాం

ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్‌ఎస్ ధీమా

హైదరాబాద్, డిసెంబర్ 13: శాసన మండలి ఎన్నికల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన టిఆర్‌ఎస్ మిగిలిన ఆరు స్థానాల్లో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ఘన విజయం సాధించడం, ఆ తరువాత మండలి ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలవడంతో టిఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అధికార పార్టీ విజయాలతో కుదేలైన కాంగ్రెస్ శ్రేణులు అనేకచోట్ల టిఆర్‌ఎస్‌లోకి వలసబాట పట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోని పలువురు ఎంపిటీసిలను పార్టీలోకి చేర్చుకోవడానికి ఆయా జిల్లాల్లో టిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే ఆరు నియోజకవర్గాల్లో ఆరింటిని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే మహబూబ్‌నగర్‌లో ఒక్క స్థానానికి గట్టి పోటీ ఉంటుందని, మిగిలిన ఐదు స్థానాల్లో టిఆర్‌ఎస్ విజయానికి ఢోకా లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు టిడిపి మద్దతు ఇస్తుందా? లేదా? అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. టిడిపి నాయకులు కొందరు తమ ఓటర్లకు కాంగ్రెస్‌కు ఓటు వేయమని చెబుతున్నారని, అయితే వారు చెప్పినంత మాత్రాన వేస్తారనే నమ్మకం లేదని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, నల్లగొండలో ఒక స్థానం, ఖమ్మంలోని ఒక స్థానంలో గెలుపుపై టిఆర్‌ఎస్ నాయకులు పూర్తి ధీమాగా ఉన్నారు. రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ పోటీ నుంచి ఉపసహంరించుకుంటారని భావించారు.
టిడిపి రంగంలో నిలవడంతో చంద్రశేఖర్‌ను పోటీ నుంచి ఉపసంహరించుకునేట్టు చేయాలనే ప్రయత్నాన్ని టిఆర్‌ఎస్ నాయకులు విరమించుకున్నారు. ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పోటీలో ఉంది. సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఖమ్మంలో టిడిపి, కాంగ్రెస్ పోటీలో లేవు. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన ఓటర్లు తుమ్మల నాగేశ్వరరావుపై వ్యతిరేకతతో టిఆర్‌ఎస్ వైపు వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు, అగ్ర నాయకుల మధ్య రాజకీయాలతో టిఆర్‌ఎస్ అభ్యర్థి విజయావకాశాలు మెరుగు పడ్డాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఒక స్థానానికి టిఆర్‌ఎస్‌కు అసలు పోటీయే లేదు. రెండవ స్థానంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తెలిపారు.