తెలంగాణ

తెరుచుకోనున్న బిల్ట్ ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆదిలాబాద్ జిల్లా మంగపేటలోని బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సిఎం కె చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. జిల్లా మంత్రి చందూలాల్ ఈ అంశంపై సిఎంతో చర్చించారు. సమైక్య పాలనలో మూతపడిన ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ, ఫ్యాక్టరీని తెరిచేందుకు సిఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. ఫ్యాక్టరీ నడించేందుకు వీలుగా కొన్ని రాయితీలు ప్రకటించారు.
ఏడేళ్లవరకు కలప, విద్యుత్‌పై ఫ్యాక్టరీకి 210 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చేందుకు సిఎం అంగీకరించారు. ఫ్యాక్టరీలో ఎనిమిది వేలమంది పని చేస్తున్నారు. ఫ్యాక్టరీని తిరిగి తెరవడంవల్ల ఎనిమిది వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఫ్యాక్టరీ తిరిగి తెరుస్తున్న సందర్భంగా మంత్రి చందూలాల్ జిల్లా ప్రజలకు అభినందనలుతెలిపారు.