తెలంగాణ

‘షీ’టీమ్‌ల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: మహిళల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘షీ’టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. మహిళలను కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రత కోసం తగు ప్రణాళిక రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ఆదివారం ‘షీ’టీమ్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. హైటెక్ సిటీ నుంచి ఎన్‌క్లేవ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు నటి జయసుధ, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ నగరంలో ఈవ్‌టీజింగ్ రోజురోజుకూ పెరిగిపోతుందని, షీటీమ్ ప్రత్యేక బృందాలతో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టగలుగుతున్నారన్నారు. సైబరాబాద్ ఐటి కారిడార్‌లోనే 35శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని వారి భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసుల పనితీరు బాగుందన్నారు.
ఆకతాయిల వేధింపులు
తగ్గాయి: జయసుధ
సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ మాట్లాడుతూ నగరంలో ఈవ్ టీజింగ్ పెద్ద సవాల్‌గా మారిందని, మహిళలపై ఆకతాయిల వేధింపులు పెరిగాయన్నారు. అయితే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘షీ’టీమ్‌ల వల్ల ఆకతాయిలకు అడ్డుకట్టపడిందన్నారు. మ హిళల భద్రతకు షీ టీమ్‌లు ఎంతో ఉపక్రమిస్తున్నాయని, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలకు పోలీసులు విధిస్తున్న శిక్ష, కౌనె్సలింగ్, కేసుల నమోదు వంటివి మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహిళల వేధింపులపై తాను నటించిన లఘు చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసం
పెరిగింది: సిపి
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ‘షీ’టీమ్స్ వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. మహిళపై వేధింపులు చాలావరకు తగ్గాయని, మహిళల భద్రతకు ఏర్పాటైన 60 బృందాలు అంకితభావంతో పనిచేస్తున్నాయన్నారు. ఒక జోన్‌కు పది బృందాలు ఏర్పాటు చేశామని, అందులో ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, మరో టాస్క్ఫోర్సు ఎస్సై ఉంటారని, వీరుకాకుండా మరో నాలుగు ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉంటాయన్నారు.
ఎవరైనా 100కు డయల్ చేస్తే ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుంటాయన్నారు. ఈ యేడాది 660 ఫిర్యాదులు వచ్చాయని, మహిళలపై వేధింపులకు పాల్పడిన 865మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 118మంది మైనర్‌లకు కౌనె్సలింగ్ నిర్వహించామని, అదేవిధంగా మరో ఏడుగురిపై నిర్భయ కేసు నమోదు చేశామని కమిషనర్ ఆనంద్ తెలిపారు.

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఓ యువతికి జ్ఞాపికను బహుకరిస్తున్న
ఎంపి కవిత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ

సాహస బాలికకు
సాదర సత్కారం
భద్రాచలం టౌన్, డిసెంబర్ 13: హిమాలయాల్లో 17, 000 వేల ఎత్తులోని (వౌంట్) రేనాక్ పర్వతాన్ని అధిరోహించి వచ్చిన భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని తుర్రం సుఖీప్రియకు సొంతగడ్డపై ఆదివారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా భద్రాచలం చేరుకున్న సుఖీప్రియకు భద్రాచలం బస్టాండ్ సమీపంలో పాఠశాల హెచ్‌ఎం మాధవి, అధ్యాపక బృందం పుష్పగుచ్ఛాలు, పూలదండలతో ముంచెత్తి అభినందించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ నుంచి పట్టణ శివారు వరకు పాఠశాల విద్యార్థినులు దాదాపు కిలోమీటరు దూరం బారులు తీరి సుఖీప్రియకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, తోటి విద్యార్థులు విద్యార్థినికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గురుకులంలో జరిగిన అభినందన సభలో ఆమెను పలువురు సత్కరించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎంఈవో వి. రంగయ్య సుఖీప్రియకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ కష్టసాధ్యమైన లక్ష్యాన్ని సాధించి వచ్చిన సుఖీప్రియ ఆదివాసీ జాతికి గర్వకారణమన్నారు. ఆదివాసీల్లో అపారశక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించిందన్నారు.
ఎస్‌సి వర్గీకరణకోసం
ఢిల్లీకి అఖిలపక్షం
కెసిఆర్‌కు ఎర్రబెల్లి బహిరంగ లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 13: ఎస్‌సి వర్గీకరణకు అవసరమైన రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాల్సిందిగా టి.టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు దయాకర్ రావు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో తమ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మద్దతుగా ఉంటుందని అన్నారు. ఉషా మెహ్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన కోరారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

మహిళల భద్రతపై టాస్క్ఫోర్స్
ఎపి ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 13: మహిళలు, బాలికలు, వయోవృద్ధుల భద్రతకు సంబంధించి వివిధ శాఖల్లో చేపట్టాల్సిన చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టాస్క్ఫోర్స్‌కు చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారని, సభ్యులుగా హోంశాఖ, వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖ, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్య, రోడ్లు, భవనాలశాఖ, ఎల్‌ఇటి అండ్ ఎఫ్ శాఖ, ఐటిఅండ్‌సి శాఖ, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్‌లను సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.