S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/17/2016 - 07:32

సంగారెడ్డి: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ కేతనం ఎగురవేసింది. తెరాస అభ్యర్ధి మారెడ్డి భూపాల్‌రెడ్డి 53 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించారు. చాలా కాలం పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొద్ది నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే.

02/17/2016 - 07:17

ఖమ్మం: రాష్ట్రంలోని ప్రజలందరికి రక్షిత మంచినీరు, సాగునీటిని అందించటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సిఎం చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నాలుగేళ్ళలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి చూపిస్తానని, భద్రాద్రి రామయ్య సాక్షిగా జరుగుతున్న తొలి శంకుస్థాపన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా మారనుందన్నారు.

02/16/2016 - 14:25

ఖమ్మం:తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో వారిద్దరూ టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

02/16/2016 - 14:25

ఖమ్మం:వచ్చే నాలుగేళ్లలో 25వేల కోట్ల రూపాయల నిధులు వ్యయం చేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. తిరుమలాయపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

02/16/2016 - 14:24

నారాయణఖేడ్:మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజికవర్గానికి ఈనెల 13న జరిగిన ఎన్నికలో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకు 53వేలకు పైగా మెజారిటీ వచ్చింది. లక్షా 54వేల 866మంది ఓటుహక్కు వినియోగించుకోగా భూపాల్‌రెడ్డి 93వేల 76 ఓట్లు వచ్చాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451, మూడోస్థానంలో టిడిపి అభ్యర్థి విజయ్‌రెడ్డికి 14వేల 781 ఓట్లు వచ్చాయి.

02/16/2016 - 02:03

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 15: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు కొండ సోమవారం శివనామ స్మరణలతో పులకించింది. బ్రహ్మోత్సవాల తొలిరోజున జడల రామలింగేశ్వరుని కల్యాణానికి తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలోనే బోళా శంకరునికి, పార్వతి దేవికి కమనీయంగా కళ్యాణం నిర్వహించారు.

02/16/2016 - 02:02

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్, తెలుగు దేశం, బిజెపి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనున్నది. 2014 ఎన్నికల్లో ఖేడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

02/16/2016 - 02:02

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: నల్లగొండ జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రం ఆలయ విస్తరణలో భాగంగా ముందుగా కొండపైన నిత్యం స్వామివారి సేవ తిరిగే ప్రాంతం సమీపంలో ఎసి వద్ద బాల ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. సోమవారం కొండపైన ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

02/16/2016 - 02:01

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న 108 వాహన సిబ్బంది తిరిగి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. 108 సర్వీస్ కింద మొత్తం 1600 మంది వరకు పని చేస్తున్నారు. 108 సర్వీస్‌ను నిర్వహిస్తున్న జివికె సంస్థ సిబ్బంది సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

02/16/2016 - 02:01

మంగపేట, ఫివ్రబరి 15 : మరో రెండు రోజుల్లో జరగనున్న మేడారం జాతర కోసం భక్త జనం అప్పుడే తరలివస్తున్నారు. వన దేవతలైన సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొంత మంది మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాల వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తలనీలాల సమర్పిస్తున్నారు. మేడారం జాతరకు విచ్చేసిన భక్తజనంలో భక్త్భివం ఉప్పొంగుతుంది.

Pages