S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/17/2016 - 12:06

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్నిగుండంలో నడుస్తూ కాలుజారి నిప్పుల్లో పడిపోయిన మహిళను పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.

02/17/2016 - 12:05

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 62వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మంత్రులు, పార్టీ నేతలు, అధికారులు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ అభిమానులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు, మంత్రులు పాల్గొన్నారు.

02/17/2016 - 12:05

మహబూబ్‌నగర్: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నిద్రమత్తులో కారును నడిపిన హరికిరణ్ అనే వ్యక్తితో పాటు జ్యోతి (38), ఆమె కుమారుడు సాయికిరణ్ (4) సంఘటన స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన హరికిరణ్ భార్య స్వప్న, జ్యోతి భర్తను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.

02/17/2016 - 08:51

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దుర్బర అసమానతలను ఎదుర్కొంటున్న వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అందుకు అనుగుణంగా వికలాంగులకు రోస్టర్ పాయింట్‌లను 10లోపు మార్చాలని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. రోస్టర్ విధానం మార్చనిదే వికలాంగులకు ఉద్యోగాలు రావని కోదండరామ్ అన్నారు.

02/17/2016 - 08:50

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంగళవారం సాయంత్రం నారాయణపేట టిడిపి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధికారికంగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాజేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, వివేకానందాగౌడ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

02/17/2016 - 08:49

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఇతర భాషలలోకి అనువాదాలు చాలా తక్కువ అవుతున్న వేళ గోండి భాషా కథలను ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలలోకి అనువదించి ప్రచురించడం ముదావహమని హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు పెరియసామి అన్నారు. సైన్స్‌లో జరిగే ఆవిష్కరణలు, ప్రయోగాలు ప్రజలకు ఉపకరించినట్లే సామాజిక శాస్త్రాల ఫలితాలూ ప్రజలకు అందాల్సి ఉందని ఆయన తెలిపారు.

02/17/2016 - 08:43

సదాశివనగర్: జంతువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. సదాశివనగర్ పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్దినెలలుగా ధర్మారావుపేట్ గ్రామ శివారులో జంతువుల కళేబరాలు, కొవ్వు, మాంసంతో నూనె తయారు చేస్తున్నారు.

02/17/2016 - 08:42

వరంగల్: కనె్నపల్లి ఆడబిడ్డ, మేడారం జాబిలి, భక్తుల ఆరాధ్య దైవం సారలమ్మ బుధవారం గద్దెపై కొలువుదీరనుంది. సారలమ్మ గద్దెపై కొలువుతీరిన సన్నివేశాన్ని తమ కనులారా వీక్షించడానికి లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. తమ ఊరి ఆడపడుచును తల్లి చెంతకు చేర్చడానికి కనె్నపల్లి గ్రామం ముస్తాబైంది.

02/17/2016 - 08:33

హైదరాబాద్, ఫిబ్రవరి 16: హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం గన్ మిస్‌ఫైర్ కలకలం రేపింది. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న అబ్బాస్ అదే ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న గన్‌మెన్‌తో మాట్లాడుతూ, మధ్యలో అతని గన్ చేతిలోకి తీసుకుని చూస్తుండగా అకస్మాత్తుగా మిస్‌ఫైర్ అయినట్టు తెలిసింది.

02/17/2016 - 07:34

హైదరాబాద్:డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో 14,664 కోట్ల రూపాయలు కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించగానే ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ గ్రేటర్ పరిధిలో ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Pages