తెలంగాణ

కోటి ఎకరాల సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: రాష్ట్రంలోని ప్రజలందరికి రక్షిత మంచినీరు, సాగునీటిని అందించటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సిఎం చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నాలుగేళ్ళలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి చూపిస్తానని, భద్రాద్రి రామయ్య సాక్షిగా జరుగుతున్న తొలి శంకుస్థాపన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా మారనుందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పట్ల అప్పటి పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తోందన్నారు. మిషన్ భగీరథతో మంచినీరు, మిషన్ కాకతీయతో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశామని, ఆరు నెలల్లోనే రామదాసు ప్రాజెక్ట్, రెండేళ్ళలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరందిస్తానన్నారు. ఇందుకోసం వచ్చే నాలుగేళ్ళలో 1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. మిషన్ భగీరథను బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లాంటి రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. పథకాల పేర్లు మార్చారని ఆరోపించే వారు ఇప్పటి వరకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. ఏడాదిన్నర కాలంలో తాము చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే విద్యుత్ సమస్య తీరిందని, అయితే మరో రెండేళ్ళలో నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్‌నందిస్తానన్నారు. కాగా, రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి ఇస్తామని, వచ్చే ఏడాది 14 వేల కోట్లతో 2 లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయనున్నామన్నారు. రాష్ట్రంలోని బిసిలందరికీ కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలంతా ఆత్మగౌరవంతో బతకాలని, పట్టుదలతో ఎన్ని విమర్శలు ఎదురైనా వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. రైతులకు రుణాలను మాఫీ చేశామని, చెల్లించాల్సిన రెండు విడతల వాయిదాలను ఒకేసారి చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
కెసిఆర్ సాక్షిగా వర్గ విభేదాలు
ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడే జలగం, తుమ్మల వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. టేకులపల్లి మండలంలో జలగం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తుమ్మల ఫోటో లేదనే కారణంతో తుమ్మల వర్గీయులు ఫ్లెక్సీలను చింపివేశారు. ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది.
నారాయణఖేడ్ ప్రజలకు కృతజ్ఞతలు
ఇటీవల జరిగిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగ్గా, టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయం సాధించటం పట్ల కెసిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అండగా ఉంటానన్నారు.

చిత్రం... సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కెసిఆర్