తెలంగాణ

వైభవంగా రామలింగేశ్వరుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 15: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు కొండ సోమవారం శివనామ స్మరణలతో పులకించింది. బ్రహ్మోత్సవాల తొలిరోజున జడల రామలింగేశ్వరుని కల్యాణానికి తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలోనే బోళా శంకరునికి, పార్వతి దేవికి కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. లోకాన్ని రక్షించే పరమ శివుని పెళ్లి కుమారుడిగా నూతన పట్టు వస్త్రాలతో అలంకరించగా స్వామిని చూసి సిగ్గులొలుకుతున్న పార్వతి దేవిని ముచ్చటగా పట్టు చీరలతో అలంకరించి కొండపైన పురవీధుల్లో ఎదురుకోల్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ వేడుకలు నిర్వహించిన ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ స్వామివారి కల్యాణ వేడుకలను వర్ణిస్తూ కల్యాణ వేడుక నిర్వహిస్తూ భక్తులకు వివరించారు. పరమ శివుడి కల్యాణం తిలకించిన భక్తులకు ఇహపర లోకాల్లో జన్మ చరితార్ధం అవుతుందన్నారు. కల్యాణ ఘట్టంలో ముఖ్యంగా స్వామి, అమ్మవారి తలంబ్రాల వేడుకలు పండితులు చూడ ముచ్చటగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసి సత్తయ్యయాదవ్, ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ అధికారి మనోహర్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.