తెలంగాణ

పరువు దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్, తెలుగు దేశం, బిజెపి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనున్నది. 2014 ఎన్నికల్లో ఖేడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే భార్యకు లేదా ఆ కుటుంబంలో ఎవరికైనా సదరు పార్టీ టిక్కెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అలా టిక్కెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి పవనాలతో సునాయసంగా గెలుపొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో సానుభూతి ఏ మేరకు పని చేసిందనేది మంగళవారం జరిగే కౌంటింగ్‌లో తేలి పోనున్నది. ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో అనుమానాలు కనిపిస్తున్నాయి. సొంత సీటును కాపాడుకోలేకపోతే అధిష్టానం వద్ద చులకన అవుతామన్న భావన, ఆవేదన టిపిసిసి ముఖ్య నేతల్లో కనిపిస్తున్నది.
ఇక మిత్రపక్షాలైన టిడిపి-బిజెపి నేతలకూ ఇది మరో పరీక్ష. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి హవా, మరోవైపు ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ సొంత సీటు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన టిడిపికి గెలుపుపై పెద్దగా ఆశల్లేవనే చెప్పాలి. ఆ పార్టీ మిత్రపక్షంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, సంతృప్తికరంగా ప్రచారం జరగలేదని, ఆశించిన విధంగా ప్రజలు ఆదరించినట్లు కనిపించలేదని టిడిపి నాయకులు అంటున్నారు.