S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/18/2016 - 06:08

హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్‌గా ప్రకటించిన సిమి ఉగ్రవాదులు ఒడిశా, తెలంగాణ సిట్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుబడ్డారు. మంగళవారం అర్థరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌లోని రౌర్కెల ఖురేషి మొహల్లాలోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు సోదా చేస్తుండగా పోలీసులపై సిమి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు.

02/18/2016 - 06:06

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు నిర్వహించినట్టే కృష్ణా పుష్కరాలూ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేద పండితులు నిర్ణయించిన మేరకు ఈ ఏడాది ఆగస్టు 12నుంచి 23వరకు కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈమేరకు నిర్ణయించారు.

02/18/2016 - 06:05

హైదరాబాద్: ప్రజావసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో అన్ని శాఖలకు నిధుల కేటాయింపు జరుగుతుందని సిఎం కె చంద్రశేఖరరావు అన్నారు. ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు నిర్మించాలన్నారు. దీనికి నిధులు కేటాయిస్తామన్నారు.

02/17/2016 - 17:53

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ప్రఖ్యాతి చెందిన పెద్దమ్మగుడిని తెలంగాణ సిఎం కెసిఆర్ తన జన్మదినం సందర్భంగా బుధవారం సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలను సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

02/17/2016 - 17:51

వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తనంత బరువున్న బెల్లం సమర్పిస్తానని గతంలో మొక్కుకున్న తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ బుధవారం మేడారం జాతరలో తన మొక్కు తీర్చుకున్నారు. తన శరీరం బరువుకు తగ్గట్టుగా ఆయన 78 కిలోల బంగారం (బెల్లం) సమ్మక్క-సారలమ్మకు సమర్పించారు. జాతర సందర్భంగా ప్రభుత్వం భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించిందని ఆయన ప్రశంసించారు.

02/17/2016 - 16:34

వరంగల్:వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. బుథవారంనాడు హైదరాబాద్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కుటుంబ సభ్యులు అమ్మవార్ల గద్దెవద్ద మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లను విహంగవీక్షణంలో పరిశీలించారు.

02/17/2016 - 16:19

వరంగల్: మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మలు గద్దెల వద్దకు చేరడానికి ముందే ప్రవాహంలా భక్తులు పోటెత్తడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి తదితర ప్రముఖలు బుధవారం అమ్మవారిని సందర్శించుకున్నారు.

02/17/2016 - 16:19

హైదరాబాద్: నగర శివారులోని ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీపై ఖాతాదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాంకు చైర్మన్, ఎండి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, బ్రాంచి మేనేజర్‌పై కేసులు నమోదు చేశారు. బ్యాంకులో తాము చేసిన డిపాజిట్లకు భద్రత లేకుండా పోయిందని కొందరు ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

02/17/2016 - 12:07

హైదరాబాద్: రాజ్‌భవన్ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించే ఇళ్ల నిర్మాణాలకు బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు శంకుస్థాపన చేశారు. సి.ఎం. కెసిఆర్, మంత్రులు హరీష్‌రావ్, ఈటెల రాజేందర్, పలువురు అధికారులు హాజరయ్యారు.

02/17/2016 - 12:06

హైదరాబాద్: నార్సంగి వద్ద మంచిరేవుల గ్రామంలో బుధవారం ఉదయం ఓ స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. తీవ్రతగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. సినిమా షూటింగ్‌ల్లో ఉపయోగించే డమీ పేలుడు పదార్థాలను దుకాణంలో సర్దుతుండగా పేలుడు సంభవించింది.

Pages