తెలంగాణ

త్వరలో బాల ఆలయ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: నల్లగొండ జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రం ఆలయ విస్తరణలో భాగంగా ముందుగా కొండపైన నిత్యం స్వామివారి సేవ తిరిగే ప్రాంతం సమీపంలో ఎసి వద్ద బాల ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. సోమవారం కొండపైన ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలోపే కొండపైన రెండు లేదా మూడు రోజుల్లో పాతభవనాల కూల్చివేతలు ప్రారంభిస్తామని ఇందుకు వ్యాపారులు సహకరించాలన్నారు. రాబోయే కాలంలో కొండపైన కేవలం టెంకాయలు, పూజా సామాగ్రి దుకాణాలు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తామన్నారు. కొండ కింద గోశాల వద్ద, అదేవిధంగా బస్టాండ్ ఎదురుగా గల పాత హైస్కూల్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున వసతి గదుల సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.