S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/19/2016 - 07:45

తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామంలో రెండువేల ఏళ్లనాటి తొలి చారిత్రాక ఆనవాళ్లను వెలికి తీసేందుకు గురువారం పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా అనుమతులతో ఈ తవ్వకాలు చేపట్టారు. తొలి చారిత్రక కాలం నాటి ప్రదేశంగా ఇక్కడ లభించిన ఆధారాలను అధికారులు గుర్తించారు.

02/19/2016 - 06:42

హైదరాబాద్: మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విస్తృత స్థాయి అభివృద్ధి, ప్రగతి ప్రణాళికను ఆవిష్కరించారు. నిర్దుష్ట రీతిలో లక్ష్యాలను నిర్దేశించుకుని వాటని వంద రోజుల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికాయుత అజెండాను ప్రకటించారు. ఇందులో భాగంగా..

02/19/2016 - 06:39

హైదరాబాద్: వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సరిపడ పరిమాణంలో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ అధాయానిచ్చే శాఖ కాదనే అభిప్రాయంతో గత ప్రభుత్వాలు ఈ శాఖకు నిధులు ఇచ్చేవి కావని, అయితే ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించేది వ్యవసాయ రంగమే కావడంతో సరిపడినంతగా నిధులు కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి సూచించారు.

02/19/2016 - 06:35

హైదరాబాద్: అసోంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై గురువారం ఆన్‌లైన్ లాటరీ ముఠా కాల్పులకు తెగబడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గౌహతి వెళ్లారు. అక్కడ పల్టాన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంటర్‌నెట్ కేఫ్‌ల్లో సోదాలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కొందరు దుండగులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు.

02/18/2016 - 18:57

వరంగల్: మేడారం జాతరలో గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి గద్దె వద్దకు సమ్మక్క అమ్మవారు బయలుదేరడంతో భక్తజనం కోలాహలం మిన్నంటింది. సమ్మక్క బయలుదేరిన సందర్భంగా ఆనవాయితీ ప్రకారం జిల్లా ఎస్పీ అంబర్ గాలిలోకి తూటాలు పేల్చారు. కలెక్టర్ కరుణ, ఇతర అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు.

02/18/2016 - 15:46

హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓ రైతు నుంచి 13 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటలో విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ ప్రభులాల్‌ను గురువారం ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ప్రభులాల్‌పై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

02/18/2016 - 13:05

హైదరాబాద్: వరంగల్ జిల్లా మేడారం వద్ద సమ్మక్క-సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సర్వీసు ప్రారంభమైంది. ముగ్గురు భక్తులతో హైదరాబాద్‌లో గురువారం ఉదయం బయలుదేరిన హెలికాప్టర్ వరంగల్ చేరుకుంది. వరంగల్ నుంచి వీరిని హెలికాప్టర్‌లో మేడారం జాతరకు తీసుకువెళతారు. హైదరాబాద్-వరంగల్, వరంగల్-మేడారం మధ్య నేడు, రేపు హెలికాప్టర్లను నడుపుతారు.

02/18/2016 - 13:04

వరంగల్: మేడారం జాతరలో ఏర్పాటు చేసిన గుడారాల వద్ద గురువారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. భక్తులు వంట చేస్తుండగా మంటలు ఎగసిపడ ఓ గుడారం కాలిపోయింది. ఈ ఘటనలో నాలుగేళ్ల బాలిక గాయపడగా చికిత్స నిమిత్తం జాతర ప్రాంగణంలోని తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు.

02/18/2016 - 13:04

హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ప్లాస్టిక్ గోడౌన్ కాలిపోయిందని సమాచారం.

02/18/2016 - 11:55

కరీంనగర్: కరీంనగర్ రామగుండం మండలం బసంతనగర్ సమీపంలో బుధవారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఎన్‌టిపిసిలో పనిచేస్తున్న ఎం.రాజకుమార్, మల్లేశ్ అనే యువకులు మరణించారు.

Pages