S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/06/2016 - 08:36

హైదరాబాద్, ఏప్రిల్ 5:మీ ఊరి చెరువుతో బాల్యంలో మీకెన్నో అనుబంధాలు ఉండవచ్చు. మిత్రులతో కలిసి ఈత కొట్టడం, చెరువు గట్టుమీద స్నేహితులతో కబుర్లు ఎన్నో జ్ఞాపకాలు. జీవన పోరాటంలో మీరిప్పుడు మీ ఊరిలో లేకపోవచ్చు. ప్రపంచంలో ఏ మూలనైనా ఉండొచ్చు. కానీ మీ ఊరి చెరువు జ్ఞాపకాలు మిమ్ములను ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మీ ఊరి చెరువు బాల్యంలో మీరు చూసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు.

04/06/2016 - 08:35

ఆదిలాబాద్, ఏప్రిల్ 5: ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన వౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఆదిలాబాద్ జిల్లా అదనపు ఎస్పీ జిఆర్ రాధిక సన్నద్ధమయ్యారు. మే నెలలో ఎవరెస్ట్ శిఖర అధిరోహణ సాహస ఘట్టానికి ఎంపికైన 10 మంది బృందంలో భారత్ తరపున తొలి మహిళగా రాధిక ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.

04/06/2016 - 08:35

కరీంనగర్, ఏప్రిల్ 5: అసలే వర్షాభావ పరిస్థితులు..ఆపై ప్రకృతి పగబట్టింది...్ఫలితంగా అన్నదాతలు బిక్కమొహాలేస్తూ దిక్కులు చూస్తున్నారు. నానా తంటాలు పడుతూ పంటలను సాగుచేస్తే, ఆ పంటలు చేతికందే వేళ ప్రకృతి పగబట్టడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి.

04/06/2016 - 08:34

హైదరాబాద్, ఏప్రిల్ 5: నిరుపేదల ఇంటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్‌రూం’ ఇళ్ల పథకంలో ఆదిలోనే దళారులు పుట్టుకొస్తున్నారు. ఇల్లు మంజూరైందని, పదివేలు చెల్లించాలంటూ లబ్దిదారులనుంచి వసూలు చేసేందుకు అప్పుడే దళారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎంతో కొంత చెల్లించి ఇల్లును సొంతం చేసుకుందామనే నిరుపేదల ఆశలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

04/06/2016 - 08:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 1204 కోట్లు కేటాయించినట్టు ఉప ముఖ్యమంత్రి ఎండి మహమూద్ అలీ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా అధ్యక్షతన జరిగిన ఓ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి రూ.

04/06/2016 - 08:33

సంగారెడ్డి, ఏప్రిల్ 5: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడలేదు ఆ గ్రామస్థులు. మిషన్ భగీరథలో సమష్టిగా భాగస్వాము లయ్యారు. పనుల్లో పాలుపంచుకుని ఒకేరోజు రికార్డు స్థాయలో 350 నల్లా కనెక్షన్లను శ్రమశక్తితో సాధించుకున్నారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రోత్సాహం మెండుగా ఉండటంతో గ్రామస్థుల ఉత్సాహానికి ఆకాశమే హద్దు అయంది. ఇంకేముంది... సగం సగం పనులతో ఆగిపోయన నల్లా కనెక్షన్లు ఏకధాటిగా ఒకేరోజు పూర్తయపోయాయ.

04/06/2016 - 08:32

హైదరాబాద్, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు స్వతంత్ర భారత్‌ను సామాజిక స్థితిగతులకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో బాబు జగ్జీవన్‌రామ్ కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

04/06/2016 - 08:20

భద్రాచలం, ఏప్రిల్ 5: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, అనుబంధ ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనల తయారీకి ఆర్కిటెక్చర్లు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంజనీర్ల బృందం, స్థపతి మంగళవారం భద్రాచలం చేరుకున్నారు.

04/06/2016 - 08:13

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడస్తున్నా ఇప్పటివరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగకపోవడం పట్ల ప్రభుత్వం విమర్శలకు గురి అవుతున్నా అధికారులలో స్పందన కరువైంది. ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదని అధికారులు కుంటి సాకులు చూపుతున్నారు. వాస్తవానికి రెండు శాఖలు మినహా మిగతా అన్ని శాఖలలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి అయింది.

04/06/2016 - 08:12

హైదరాబాద్, ఏప్రిల్ 5: పరీక్షలు ముగియడంతో సెలవులు ఎంజాయ్ చేయడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో కరెంట్‌షాక్‌కు గురై మరణించడంతో నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూ పార్క్‌లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ, వారు చూస్తుండగా జూపార్కులోని నిషేధిత ప్రాంతంలో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది.

Pages