తెలంగాణ

చెరువు మీదిరో... పేరు మీదిరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5:మీ ఊరి చెరువుతో బాల్యంలో మీకెన్నో అనుబంధాలు ఉండవచ్చు. మిత్రులతో కలిసి ఈత కొట్టడం, చెరువు గట్టుమీద స్నేహితులతో కబుర్లు ఎన్నో జ్ఞాపకాలు. జీవన పోరాటంలో మీరిప్పుడు మీ ఊరిలో లేకపోవచ్చు. ప్రపంచంలో ఏ మూలనైనా ఉండొచ్చు. కానీ మీ ఊరి చెరువు జ్ఞాపకాలు మిమ్ములను ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మీ ఊరి చెరువు బాల్యంలో మీరు చూసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు. పూడికతో కళావిహీనమై ఉండొ చ్చు. అలాంటి మీ ఊరి చెరువుకు మీ బాల్యంలో ఉన్నట్టు పూర్వవైభవం తేవాలనుకుంటున్నారా? పైగా ఆ చెరువుకు మీ పేరే పెడితే ఎలా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారికి, బాల్యాన్ని మరువని వారికి ఇదో మంచి అవకాశం. ఓన్ యువర్ ట్యాంక్ పేరుతో మీ గ్రామంలోని మీ చెరువును మీరే దత్తత తీసుకొని పునరుద్ధరించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఓన్ యువర్ ట్యాంక్’ కింద చెరువులను దత్తత తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువుల వ్యవస్థ తెలంగాణకు జీవనాడి అని, దీనికి పూర్వవైభవం తీసుకువచ్చే సంకల్పంతో చేపట్టిన మిషన్ కాకతీయకు దేశ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయని అన్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకానికి అందజేసే విరాళాలకు కేంద్రం ఐటి మినహాయింపు ఇస్తోందని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఎవరైనా ఈ పథకానికి విరాళాలు ఇవ్వవచ్చునని తెలిపారు. గ్రామంలోని చెరువుపునరుద్ధరణకు అయ్యే మొత్తం భరిస్తే ఆ చెరువుకు వారి పేరే పెడతారని చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన శోధన లాబ్స్ ఎండి డాక్టర్ గిరిధర్ తోట 25 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా చెక్కును గిరిధర్ మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.
గత ఏడాది కూడా గిరిధర్ తోట వరంగల్ శివారులోని మడికొండ చెరువు పునరుద్ధరణ కోసం 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈసారి ఇచ్చిన 25 లక్షలతో మడికొండ చెరువుకోసం 15 లక్షలు, రాంపూర్ గ్రామ పరిధిలోని ఊర చెరువు కోసం 10 లక్షలు ఇస్తున్నట్టు గిరిధర్ తెలిపారు. గిరిధర్ తోటను ప్రతి ఎన్‌ఆర్‌ఐ, ప్రతి పారిశ్రామికవేత్త స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.