తెలంగాణ

జగ్జీవన్‌రామ్ గొప్ప సమతావాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు స్వతంత్ర భారత్‌ను సామాజిక స్థితిగతులకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో బాబు జగ్జీవన్‌రామ్ కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, సమతావాదిగా, సంఘ సంస్కర్తగా, ప్రజా నాయకునిగా జగ్జీవన్‌రామ్ దేశ ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ ఉండిపోతారని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. దళితులను అవమానిస్తే సహించేది లేదని ఎంపి కవిత హెచ్చరించారు. బిజెపి మహిళా నేత దళితులను అవమానించే విధంగా మాట్లాడిన అంశాన్ని ప్రాస్తావించారు. దళితుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదురయ్యే సమస్యలపై పోరాడాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. బషీర్‌బాగ్‌లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. అణగారిన వర్గాల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని అన్నారు. దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరిస్తేనే వారి జీవితాల్లో వెలుగు సాధ్యం అనే ఉద్దేశంతో దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల కమిటీ కో చైర్మన్ బత్తుల రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు.
బెన్‌హర్ ఎక్కా, యంవై రెడ్డి, ఆర్‌యస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.