తెలంగాణ

ముస్లిం మైనారిటీలకు రూ. 1204 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 1204 కోట్లు కేటాయించినట్టు ఉప ముఖ్యమంత్రి ఎండి మహమూద్ అలీ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా అధ్యక్షతన జరిగిన ఓ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి రూ. 693కోట్లు, సామాజికాభివృద్ధికి రూ.243 కోట్లు, ఆర్థిక తోడ్పాటుకు రూ.162కోట్లు, నైపుణ్య అభివృద్ధికి రూ.162 కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన షాది ముబారక్ పథకం అమలు తీరుతెన్నులను ఈ సమావేశంలో అలీ వివరించారు. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఆమె నివాసంలో ఉపముఖ్యమంత్రి అలీ, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రుడు తేజవత్, వేణుగోపాలచారి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో సౌది అరేబియా కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు సహకరించాలని సుష్మను కోరినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలు, లంబాడాల తెగలను భారతదేశానికి ఆహ్వానించి ఒక సదస్సు ఏర్పాటు చేయాలని సుష్మాను కోరారు. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు తీర్మానాన్ని రాష్టప్రతికి నివేదించామన్నారు.
వడదెబ్బతో ఆరుగురు మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 5: మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న గోకారి (65) అనే వ్యక్తి వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన అంకిల్ల వౌనిక (16) అనే ఇంటర్ విద్యార్థిని మంగళవారం తెల్లవారుజామున వడదెబ్బతో మృతి చెందింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన పూసాల సంపత్ (37) అనే ట్రాక్టర్ డ్రైవర్, టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త మంగళవారం వడదెబ్బతో మృతి చె ందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచా యతీ పరిధిలోని ఆరెగూడెంకు చెందిన అర్రూరి అంజయ్య (80) వేసవిలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతను తట్టుకోలేక అనారోగ్యం బారిన పడి వడదెబ్బతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు కటుకం నర్సవ్వ (75) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారు కాలనీతండా సమీపంలో జాటోత్ రామోజి (63) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు.
నకిలీ సాస్, శొంఠి తయారీ కేంద్రాలపై
ఎస్‌ఒటి పోలీసుల దాడి
ఒకరి అరెస్టు, మరొకరు దాడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 5: నగరంలో కల్తీసాస్, శొంఠి తయారీ కేంద్రాలపై మంగళవారం ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో కల్తీసాస్ తయారు చేస్తున్న వ్యాపారి దినేష్ కుమార్ కొంతకాలంగా ఓ గోడౌన్‌లో నకిలీ సాస్ తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు గోడౌన్‌పై దాడి చేసి యజమాని దినేష్‌ను అరెస్టు చేశారు. అదేవిధంగా అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో నకిలీ శొంఠి తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్‌ఓటి పోలీసులు దాడి చేశారు. యజమాని పరారీలో ఉన్నాడు.

ర్ కాగా అక్కడి నుంచి 1000కిలోల అల్లం, ఫెవికల్, నీలి రంగు కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వున్న వ్యాపారి దుపేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఎస్‌ఓటి పోలీసులు తెలిపారు.