తెలంగాణ

ఎక్కడి క్రమబద్ధీకరణ అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడస్తున్నా ఇప్పటివరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగకపోవడం పట్ల ప్రభుత్వం విమర్శలకు గురి అవుతున్నా అధికారులలో స్పందన కరువైంది. ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదని అధికారులు కుంటి సాకులు చూపుతున్నారు. వాస్తవానికి రెండు శాఖలు మినహా మిగతా అన్ని శాఖలలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి అయింది. కనీసం విభజన జరిగిన శాఖలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులనైనా క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారుల చర్యలు లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అయినప్పటికీ ప్రభుత్వ హామీని శాఖాధిపతులు తీవ్రంగా పరిగణించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇదే అంశంపై వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. క్రమబద్దీకరణకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య సుమారు 25 వేల పై చిలుకు ఉంటుందని ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి అందింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మార్గదర్శకాలను గత ఏడాది విడుదల చేసింది. ఈమేరకు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల జాబితాలతో ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు పంపించాలని మూడు నెలలుగా రాజీవ్ శర్మ పదే పదే కోరుతున్నా ఇంకా చాలా శాఖల నుంచి తుది జాబితాలు అందలేదని తెలిసింది.
ఈ అంశంపై సచివాలయంలో రాజీవ్ శర్మ సోమవారం నిర్వహించిన సమావేశానికి కొన్ని శాఖల నుంచి తుది ప్రతిపాదనలు అందకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల తుది జాబితా తయారీలో జాప్యానికి కారణంగా అధికారులు సమాధానం చెప్పినట్టు తెలిసింది. అయితే వారి ఇచ్చిన సమాధానంతో రాజీవ్ శర్మ ఏకీభవించనట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలలో వైద్య, అరోగ్యశాఖ ఒక్కటే ప్రధానమైందని, మిగతావన్నీ 9, 10 షెడ్యూల్ కింద ఉన్న సంస్థలకు సంబంధించినవే కాగా, ఈ రెండు షెడ్యూల్ కింద ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం కుదరదని అధ్యయన కమిటీ ఇప్పటికే తేల్చి చెప్పింది. మరి అలాంటప్పుడు దాదాపు ఉద్యోగుల విభజన పూర్తి అయిన శాఖల నుంచి తుది ప్రతిపాదనలు ఎందుకు రావడం లేదని ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది.