తెలంగాణ

ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుంటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 5: ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన వౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఆదిలాబాద్ జిల్లా అదనపు ఎస్పీ జిఆర్ రాధిక సన్నద్ధమయ్యారు. మే నెలలో ఎవరెస్ట్ శిఖర అధిరోహణ సాహస ఘట్టానికి ఎంపికైన 10 మంది బృందంలో భారత్ తరపున తొలి మహిళగా రాధిక ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. గత ఏడాది దేశ సరిహద్దులోని కున్ పర్వతం 7077 మీటర్ల ఎత్తును అలవోకగా అధిరోహించి ప్రపంచంలోనే రెండవ మహిళగా రాధిక అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే తన జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్న రాధిక ఈమేరకు తనకు అవసరమైన కిట్లు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు ఫీజులు, ఇతర వౌలిక వసతులకు డబ్బులు కావాలని తెలంగాణ హోంశాఖకు దరఖాస్తు చేసుకోగా ఈమేరకు రూ.35 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు గత ఆరు నెలల నుండి కసరత్తు సాగిస్తున్న రాధికకు ప్రభుత్వం నుండి సహకారం అందడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈనెల 11న నేపాల్‌లోని ఖాట్మండు చేరుకుని 14న బేస్‌క్యాంప్‌లోని పది మంది పర్వతారోహకుల బృందంలో చేరుతానని ఆమె తెలిపారు. పది మంది సభ్యుల్లో ముగ్గురు విదేశీయులు కాగా మరొకరు దుబాయకి చెందిన ప్రవాస భారతీయుడని, మరో ఆరుగురు భారతదేశానికి చెందినవారని ఆమె తెలిపారు. వీరందరిలో ఒకే ఒక్క మహిళగా తనకు ఎవరెస్ట్ అధిరోహించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని రాధిక పేర్కొన్నారు. 8850 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మే 12 నుంచి 27 తేదీల మధ్య వాతావరణం అనుకూలించిన సమయంలోనే ఎవరెస్ట్ శిఖర అధిరోహణకు సిద్ధమవు తామన్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధమైన అదనపు ఎస్పీ రాధికను మంగళవారం జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా సాగనంపారు.