తెలంగాణ

యాదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 5: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, అనుబంధ ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనల తయారీకి ఆర్కిటెక్చర్లు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంజనీర్ల బృందం, స్థపతి మంగళవారం భద్రాచలం చేరుకున్నారు. స్థపతి వల్లీ నారాయణన్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఆనందసాయి, రవి, మధుసూదనరావు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు భద్రాచలం, పర్ణశాల, ఎటపాకలోని జటాయువు మంటపాలను సందర్శించారు. వైదిక కమిటీ, ఈఓ జ్యోతితో సమావేశమయ్యారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని వారు తెలిపారు. భద్రాచలం రామాలయానికి రెండో ప్రాకారంతో పాటు, మాడవీధులు, కోనేరు నిర్మాణం గురించి పరిశీలించామన్నారు. పర్ణశాలలో కల్యాణ మంటపం, వసతి, జటాయువు మంటపం, ఎటపాకలో రాముడు, జటాయువుకు సంబంధించిన 12 సన్నివేశాలతో శిలారూపాలు, మంటపం, పార్కు నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. మొత్తం రెండు ప్రతిపాదనలు తయారుచేసి ముందుగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని, అక్కడి నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కెసీఆర్‌కు సమర్పించి వారి సూచనల మేరకు ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. మొత్తంగా రూ.1000 కోట్లతో రామాలయం, అనుబంధ ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను సిఎం కెసీఆర్ ఈ నెల 15న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం వేళ ప్రకటించే అవకాశం ఉందన్నారు