తెలంగాణ

అకాల వర్షం.. అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 5: అసలే వర్షాభావ పరిస్థితులు..ఆపై ప్రకృతి పగబట్టింది...్ఫలితంగా అన్నదాతలు బిక్కమొహాలేస్తూ దిక్కులు చూస్తున్నారు. నానా తంటాలు పడుతూ పంటలను సాగుచేస్తే, ఆ పంటలు చేతికందే వేళ ప్రకృతి పగబట్టడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్, మానకొండూర్, ఓదెల, శంకరపట్నం, కరీంనగర్, గంగాధర, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, మంథని, కమాన్‌పూర్, ముత్తారం, కోహెడ, ధర్మపురి, బోయినపల్లి, కాల్వశ్రీరాంపూర్, సారంగపూర్, ఇల్లంతకుంట, హుజురాబాద్, హుస్నాబాద్ తదితర మండలాల్లో వర్షం పడింది. శంకరపట్నం, మానకొండూర్ మండలాల్లో ఈదురుగాలులు వీచడంతో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో ఆ రహదారిపై రెండుగంటల పాటు రాకపోకలు స్తంభించాయి. మానకొండూర్ మండలం గుట్టుదుద్దెనపల్లిలో పెట్రోల్ బంక్‌కు చెందిన పవర్‌రూంపై పిడుగు పడటంతో పవర్ రూం దగ్ధమైంది. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన దుద్దుల నరేష్ (22) అనే యువకుడు పిడుగుపాటుకు మృతి చెందగా, ఎలిగేడు మండలం మల్లయ్యపల్లిలో గోడ కూలి చందా అశ్విని (9) అనే చిన్నారి మృతి చెందింది. కరీంనగర్ మండలం ఎలబోతారం గ్రామంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. ముత్తారం మండలంలో చెట్టు ఒక ఇంటిపై పడగా, ఆ ఇళ్లు కూలిపోయింది. మొత్తానికి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కాగా, మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఈ అకాల వర్షం కొంత ఊరటనివ్వగా, వాతావరణం కొంతమేర చల్లబడింది.