తెలంగాణ

ప్రాణం తీసిన సెల్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: పరీక్షలు ముగియడంతో సెలవులు ఎంజాయ్ చేయడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో కరెంట్‌షాక్‌కు గురై మరణించడంతో నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూ పార్క్‌లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ, వారు చూస్తుండగా జూపార్కులోని నిషేధిత ప్రాంతంలో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. హఠాత్ పరిణామంతో అతడి కుటుంబసభ్యులు, సందర్శకులు విషాదంలో మునిగిపోయారు.
నగరంలోని పురానాపూల్‌కు చెందిన మదన్ చౌదరి కుమారుడు మంజిత్ కుమార్ పదోతరగతి చదువుతున్నాడు. రెండురోజుల క్రితమే పరీక్షలు ముగియగా మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి జూపార్క్‌కు వచ్చారు. కాగా పార్క్‌లోని బటర్ ఫ్లై జోన్‌వద్ద నోఎంట్రీ, నిషేధిత స్థలం ప్రాంతంలో సెల్ఫీతో ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి విద్యుత్ తీగపై పడిపోయాడు. వెంటనే తీగలతోపాటు నీళ్లలోకి జారిపోయాడు. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో షాక్ కొట్టి అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జూ పార్క్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిషేధిత ప్రాంతవద్ద హెచ్చరిక బోర్డులు లేవని, జూ సిబ్బంది నిర్లక్ష్యంవల్లే తన కొడుకు మృతి చెందాడని విద్యార్థి తండ్రి మదన్ చౌదరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
పరీక్షలు ముగిసిన రెండ్రోజులకే
పదోతరగతి పరీక్షలు ముగిసిన రెండ్రోజులకే తన కుమారుడికి నిండు నూరేళ్లు నిండాయంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విద్యార్థి మృతి పార్క్‌లోని సందర్శకులను కలచివేసింది.
హెచ్చరిక బోర్డులు లేకే!
జూపార్క్‌లో హెచ్చరిక బోర్డులు సరిగ్గా లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సందర్శకులు జూపార్క్ అధికారులపై మండిపడ్డారు. సందర్శకుల భద్రతపై సిబ్బంది దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ‘కబందా’ అనే పులి బయటికి వచ్చిన సంఘటనను వారు ఉదహరిస్తున్నారు.

ఇద్దరు పిల్లలకు ఉరివేసి
ఆపై తల్లి ఆత్మహత్య
గుత్తి, ఏప్రిల్ 5 : ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆపై ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా చెట్నేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి గ్రామానికి చెందిన రవికి, బెంగళూరుకు చెందిన నేత్రావతి(25)కి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మురారి(5), ముఖేష్(3) సంతానం. పెళ్లైన తర్వాత కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో గత కొద్దికాలంగా కలతలు ఏర్పడ్డాయి. దీంతో రవి, నేత్రావతి నిత్యం ఘర్షణ పడుతుండేవారు. ఆక్రమంలోనే సోమవారం రాత్రి కూడా వారు ఘర్షణ పడ్డారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నేత్రావతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆపై ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.