S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2016 - 07:24

వరంగల్, ఆగస్టు 19: వరంగల్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ అగ్గిరాజుకుంది. జనగామ, ములుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే గత కొన్నిరోజులుగా జనగామ, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉవ్వెత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

08/20/2016 - 07:23

హైదరాబాద్, ఆగస్టు 19: పత్తి పంట విస్తీర్ణాన్ని తగ్గించి, సోయా, ఇతర పంటల వైపు రైతులు వెళ్లేట్టు చూడాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గతంలో ఎప్పు డూ లేని విధంగా పత్తి రైతుల ఆత్మహత్యలు, పత్తి ధర తగ్గడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం చాలా ముందుగానే ఈసారి ఖరీఫ్ సీజన్‌లో పత్తికి బదులు ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించింది. సబ్సిడీలు సైతం ప్రకటించింది.

08/20/2016 - 07:22

గద్వాల, ఆగస్టు 19: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోందని, గతంలో 14 జిల్లాలు అంటూ నేడు 17 జిల్లాలకు పెంచినప్పటికీ గద్వాల పేరు లేకపోవడం బాధాకరమని, ముఖ్యమంత్రికి నడిగడ్డపై ఎందుకింత వివక్ష అని మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ప్రశ్నించారు.

08/20/2016 - 07:21

అడ్డాకుల, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రాజెక్టులు లేకపోవడంతో.. కేవలం వర్షాధారంపై ఆధారపడి మాత్రమే తెలంగాణ ప్రజలు పంటలు పండించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

08/20/2016 - 07:20

మహబూబ్‌నగర్, ఆగస్టు 19: కృష్ణానది నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. తంగిడిగి పుష్కర ఘాట్ నుండి మొదలుకుని రంగాపూర్ , బీచుపల్లి పుష్కర ఘాట్ వరకు కృష్ణానది వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ పుష్కర ఘాట్లలో మెట్లు రోజురోజుకు తేలిపోతున్నాయి. మరోపక్క శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరగడంతో జోగులాంబ, సోమశిల పుష్కర ఘాట్లకు పుష్కర ఘాట్లలలో మాత్రం కృష్ణమ్మ జలాలు నిండుకుండలా ఉన్నాయి.

08/20/2016 - 06:28

హైదరాబాద్, ఆగస్టు 19: సంచలనం సృష్టిస్తోన్న నరుూం వ్యవహారంలో అధికారపార్టీ పెద్దలు ఉన్నారన్న వార్తలు సిట్ విచారణపై అనుమానాలకు తెరలేపుతున్నాయి. విచారణను సీబీఐకి అప్పగిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు సైతం ఇదే డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్నాయి. అన్ని పార్టీలు సీబీఐ విచారణకు పట్టుపడుతున్నాయి.

08/20/2016 - 06:25

సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 19: మాఫియా డాన్ నరుూం కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాలలో వేలకోట్ల ఆస్తులు కూడబెట్టిన నరుూంతో పూర్తిగా అంటకాగిన వారు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారేనని ఆయన ఆరోపించారు.

08/20/2016 - 06:23

హైదరాబాద్, ఆగస్టు 19: ఒలింపిక్స్‌లో పివి సింధు రజత పతకాన్ని గెలుచుకోవడం దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. ఒలింపిక్స్‌లో తొలి రజత పతకాన్ని దక్కించుకున్న మహిళగా సింధు చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సింధుకు శిక్షణ ఇచ్చిన పుల్లెల గోపిచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.

08/20/2016 - 06:12

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో సీట్ల భర్తీకి శుక్రవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన చేపడతారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా 16 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 26న 12 వేల ర్యాంకు వరకూ, 27న 24వేల ర్యాంకు వరకూ, 28న 36వేల ర్యాంకు వరకూ , 29న 50 వేల ర్యాంకు వరకూ, 30న చివరి ర్యాంకు వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చు.

08/20/2016 - 06:09

భువనగిరి, ఆగస్టు 19: తమకు నచ్చిందంటేచాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బెదిరించైనా పనికానివ్వాల్సిందే... ఇదే గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరుల స్టైల్. రైతులను, వ్యాపారస్థులను చంపుతామని బెదిరించి వారి భూములను తమపేర రిజిస్ట్రేషన్ చేసుకున్న నరుూం బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తూ పోలీస్‌స్టేషన్లలో పిర్యాదు చేస్తున్నారు.

Pages