S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2016 - 07:19

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 21: గ్యాంగ్‌స్టర్ నరుూం బంధువులను సిట్ అధికారులు, మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీసులు విచారణ కొనసాగిస్తునే ఉన్నారు. బంధువుల్లో ఇద్దరు తోడల్లుడు, అతని భార్యను విచారించగా వారి పేరిట నరుూం అత్తా ఈదులగూడలోని ఒక ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్టు వెల్లడైంది.

08/22/2016 - 07:09

భద్రాచలం, ఆగస్టు 21: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రెండు ఆభరణాలు కన్పించడం లేదనేది వాస్తవమేనని దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రభూమిలో వచ్చిన కథనంపై ఆయన స్పందిస్తూ తనకు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అర్చకులను ఆభరణాలు తనిఖీ చేయాని ఆదేశించానన్నారు.

08/22/2016 - 07:00

హైదరాబాద్, ఆగస్టు 21: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకే సమయంలో రెండు అవయవాల మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. ఒక అవయవ మార్పిడి సాధారణమే అయినా, రెండు అవయవ మార్పిడులు చేయ డం కష్టసాధ్యం. దాన్ని ఉస్మానియా వైద్యులు సాధించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లివర్, కిడ్నీలను ఇద్దరు రోగులకు ఒకే సమయంలో మార్పిడి చేసి అసాధరణ ప్రతిభ చూపించారు.

08/22/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 21: జైపూర్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం టిఆర్‌ఎస్ ఎంపి కవిత వివరించారు. సదస్సు రెండవ రోజు కార్యక్రమాల్లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్య దేశాలు తీసుకోవలసిన చర్యల గురించి జరిగిన చర్చలో ఎంపి కవిత మాట్లాడారు.

08/22/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 21: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల్లో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత అతని అక్రమ వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. భూ అక్రమ దందా, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్, బెదిరింపులు, హత్యలు ఎనె్నన్నో వ్యవహారాలపై సిట్ అధికారులు చేపట్టిన విచారణ రెండు వారాలుగా కొనసాగుతోంది.

08/22/2016 - 06:57

హైదరాబాద్, ఆగస్టు 21: హిందూధర్మ పరిరక్షణ, సనాతనధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్న సంస్థల్లో హైదరాబాద్ సమీపంలోని ‘సాయిధామం’ (సేవాశ్రమం) సంస్థను ప్రధానంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, ఆధ్యాత్మిక కేంద్రమైన కీసరకు ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం లోని రామలింగపల్లి గ్రామ పరిధిలో సాయిధామ క్షేత్రం ఉంది.

08/22/2016 - 06:44

కృష్ణా పుష్కరాలు
రెండు రోజుల్లో ముగుస్తుండడంతో
పుణ్య స్నానాలకోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాగార్జునసాగర్ రూట్‌లో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఆదివారం వాహనాలు బారులుతీరాయంటే భక్తజన తాకిడి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం అవుతోంది.

08/22/2016 - 06:41

హైదరాబాద్, ఆగస్టు 21: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అశాస్ర్తియంగా జరుగుతోందన్న ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. పాలనాసౌలభ్యం కోసమే జిల్లాల విభజన జరుగుతోందంటున్న ప్రభుత్వం, ఆ ప్రాతిపదికకు అయినా కట్టుబడి ఉందా? అంటే అదీ లేదు.

08/22/2016 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్-2016 జిమ్మాస్టిక్ విభాగంలో నాలుగో స్థానం సాధించిన జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 50 లక్షల బహుమతి ప్రకటించారు. ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించటం స్ఫూర్తిదాయకమని సిఎం అన్నారు.

08/22/2016 - 06:36

హైదరాబాద్, ఆగస్టు 21:కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వం కోరుకున్న విధంగా సాగుతోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే 27 జిల్లాలతోపాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల గురించి పూర్తి వివరాలు పొందు పరుస్తారు. జిల్లా కలెక్టర్లకు ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన చట్టం 1974లో ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని మాత్రమే ఉంది.

Pages