తెలంగాణ

జిల్లాల ఏర్పాటు ఉద్యమం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 19: వరంగల్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ అగ్గిరాజుకుంది. జనగామ, ములుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే గత కొన్నిరోజులుగా జనగామ, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉవ్వెత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ ముందు జనగామను జిల్లా ఏర్పాటు చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంగా చెప్పినప్పటికీ ఆ ప్రతిపాదనను పక్కనబెట్టి తెరపైకి హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తీసుకురావడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. డిమాండ్ ఉన్న జనగామను జిల్లా చేయకుండా ఎలాంటి డిమాండ్ లేని హన్మకొండను జిల్లా చేయడం పట్ల విపక్ష నాయకులంతా మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా ప్రాధాన్యతను దెబ్బతీసేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కుట్ర పన్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు ములుగును జిల్లా చేయాలని కోరుతూ చేస్తున్న ఆందోళనలు శుక్రవారం మరింత ఉద్ధృతమయ్యాయి. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి చందూలాల్‌ను ప్రజలు అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఏర్పాటు విషయంలో అక్కడి ప్రజలు 144 సెక్షన్ కూడా లెక్కచేయకుండా ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులందరినీ పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు మహిళలు సైతం రోడ్డుపైకి చేరుకున్నారు. జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాగా, శనివారం హైదరాబాద్‌లో జరిగే అఖిలపక్ష సమావేశంలో కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాను అడ్డుకుంటామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. చారిత్రాత్మక చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని రెండుగా చేసి వరంగల్ ప్రాధాన్యతను సిఎం కెసిఆర్ దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని బిజెపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తాజాగా తీసుకున్న హన్మకొండ జిల్లా ప్రతిపాదనను వెనక్కి తీసుకొని జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, ములుగు జిల్లా ఏర్పాటు కాకపోయినా భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని ములుగు నుండైనా పరిపాలన పనులు జరిగే విధంగా చూడాలని కోరుతూ ఆందోళనలు మిన్నంటాయి.

జనగామలో ఆందోళనలు చేస్తున్న ప్రజలు, జెఎసి నాయకులు