తెలంగాణ

26 నుండి ఐసెట్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో సీట్ల భర్తీకి శుక్రవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన చేపడతారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా 16 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 26న 12 వేల ర్యాంకు వరకూ, 27న 24వేల ర్యాంకు వరకూ, 28న 36వేల ర్యాంకు వరకూ , 29న 50 వేల ర్యాంకు వరకూ, 30న చివరి ర్యాంకు వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చు. 26 నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన చేయించుకున్న వెంటనే అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేయవచ్చు. సెప్టెంబర్ 1న ఏమైనా మార్పులు ఉండే సవరించుకునే వీలు కల్పించారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 3న జరుగుతుంది.
డి. ఫార్మసీలో 679 సీట్ల మిగులు
డి.్ఫర్మసీలో 890 సీట్లకు గానూ 211 మందికి సీట్ల కేటాయింపు జరగ్గా 679 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 16 కాలేజీల్లో 890 సీట్లు ఉన్నాయని కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్ జి శ్రీనివాస్ తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 23న తమ ఫీజులను చెల్లించాలని, 20వ తేదీ నుండి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన చెప్పారు.

తెలంగాణలో 26 నుండి ఐసెట్ అడ్మిషన్లు

ఆంధ్రభూమి బ్యూరో

టిఎస్‌పిఎస్‌సికే గురుకుల
పోస్టుల భర్తీ బాధ్యత
సొసైటీ బోర్డు నిర్ణయం

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ గురుకులాల్లోని పోస్టులను భర్తీ చేసే బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కే అప్పగించాలని గురుకులాల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు. తొలి దశలో 313 పోస్టులను భర్తీ చేయాల్సిందిగా పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు సొసైటీ సూచించింది. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల సొసైటీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించింది.
మరో పక్క విద్యార్థులకు యూనిఫారాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, బెడ్డింగ్ మెటీరియల్, ట్రంక్ బాక్స్‌లు, ప్లేట్లు , గ్లాసులు, బూట్లు, సాక్సులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహించగా, 8 మంది సీనియర్ అధికారులు, 8 మంది ఇతర సభ్యులు హాజరయ్యారు.