తెలంగాణ

సిబిఐ విచారణే సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: సంచలనం సృష్టిస్తోన్న నరుూం వ్యవహారంలో అధికారపార్టీ పెద్దలు ఉన్నారన్న వార్తలు సిట్ విచారణపై అనుమానాలకు తెరలేపుతున్నాయి. విచారణను సీబీఐకి అప్పగిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు సైతం ఇదే డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్నాయి. అన్ని పార్టీలు సీబీఐ విచారణకు పట్టుపడుతున్నాయి.
నరుూం ఘోరాలు ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా ఏపి, కర్నాటక, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌కూ విస్తరించినందున, కేసును సీబీఐకి అప్పగించడమే సబబన్న వాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం తెరాసలో ఉన్న మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు నరుూం కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నరుూంకు ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై పేర్లతో సహా చర్చ జరుగుతోంది.
అందులో ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ల నుంచి తెరాస, కాంగ్రెస్, తెదేపా నేతల వరకూ ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అందులో చోటు చేసుకున్న వారంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి, నరుూంతో తమకెలాంటి సంబంధాలు లేవని మీడియాకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒకడుగు ముందుకేసి, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, మరో పోలీసు అధికారి శివశంకర్‌రెడ్డి కూడా స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి తమకు నరుూంతో ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న ఐపిఎస్ అధికారుల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ మారిన ఒక ఎమ్మెల్సీ తొలి నుంచీ నరుూం బినామీగా ఉన్నారని, ఆయనను కొద్దిసేపట్లో అరెస్టు చేయనున్నారంటూ చానెళ్లలో గత రెండురోజుల క్రితం వచ్చిన వార్తలు తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. సోషల్ మీడియాలో వస్తున్న పేర్లలో ఐపిఎస్ ప్రముఖులు కూడా ఉండటంతో వారి విచారణ తీరుపైనా అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు సీనియర్ ఐపిఎస్ అధికారులను విచారించేంత ధైర్యం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు నరుూం ఎన్‌కౌంటర్ నుంచి అతని బినామీ ఆస్తులు, అతని వెనుక ఉన్న అదృశ్య శక్తులు, వాడుకున్న ప్రముఖుల పేర్లు బయటకు రావాలంటే సీబీఐ విచారణే సరైనదన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. నరుూంతో చెట్టపట్టాల్ వేసుకున్న వారిలో ఎక్కువమంది అధికారపార్టీ ప్రముఖులే ఉండటంతో, వారిని ప్రశ్నించి నిజాలు రాబడితే అధికారపార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే విచారణ అంతా లీకులతోనే సరిపోతోందని, ఒకసారి డాక్యుమెంట్లలో అందరి పేర్లు ఉన్నాయని, మరొకసారి కోడ్ భాషలో ఉన్నాయని, అందరి ఫోన్లను రికార్డు చేశారని లీకులు ఇస్తున్నారే తప్ప, వారి పేర్లు ఇంతవరకూ బయటపెట్టకపోవడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.
అసలు నరుూంను కేవలం మావోయిస్టులను హతమార్చేందుకే వాడుకున్నారా? లేక దానిపేరు చెప్పి ఇతర మార్గాలు పట్టారా? పోలీసులతో సన్నిహితంగా మెలిగిన నరుూం దానిని అడ్డుపెట్టుకుని ఎంత సంపాదించారు? ఆ క్రమంలో ఎవరెవరిని బెదిరించారు? అందులో పోలీసులు, రాజకీయ నాయకుల పాత్ర ఎంత? నిజంగా నరుూం డంపులలో ఉన్నది ఎంత? బయటకొస్తున్నది ఎంత? అన్నది తేలాలంటే సీబీఐ విచారణే సరైదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఎంసెట్ లీకు కేసులో ఒక డీఎస్పీ స్థాయి అధికారే విచారణకు వెళ్లి నిందితుడి దగ్గర మూడు లక్షల లంచం తీసుకున్నారంటే, వందలకోట్ల సంపద ఉందన్న ప్రచారం జరుగుతోన్న నరుూం వద్ద ఉన్న సొమ్ము సంగతేమిటన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి.
నరుూం గురించి రోజుకో కథనాలు లీక్ చేస్తున్న అధికారులు, ఎక్కడెక్కడ ఏయే ఆస్తులు సంపాదించారని చెబుతున్నారే తప్ప, పోలీసు ఉన్నతాధికారులెవరున్నారన్నది ఇప్పటివరకూ సూచనప్రాయంగా కూడా లీక్ చేయకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ నేతల పేర్లు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదంటున్నారు.నరుూంకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు సిట్ స్థాయి సరిపోదని, ప్రభుత్వానికి సైతం రాజకీయంగా కొన్ని మొహమాటాలు, రాజకీయ ఇబ్బందులున్నందున ప్రభుత్వమే స్పందించి, సీబీఐ విచారణకు లేఖ రాస్తే నరుూం బాగోతం బయటకు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇందులో తమ పార్టీవారే ఎక్కువగా ఉన్నందున టిఆర్‌ఎస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు వెనుకంజ వేస్తుందా? లేక నిజాలు బయటపెట్టేందుకు తనంతట తానే సీబీఐ విచారణ కోరుతుందా చూడాలి.