తెలంగాణ

ఖరీఫ్‌లో తగ్గిన పత్తి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: పత్తి పంట విస్తీర్ణాన్ని తగ్గించి, సోయా, ఇతర పంటల వైపు రైతులు వెళ్లేట్టు చూడాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గతంలో ఎప్పు డూ లేని విధంగా పత్తి రైతుల ఆత్మహత్యలు, పత్తి ధర తగ్గడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం చాలా ముందుగానే ఈసారి ఖరీఫ్ సీజన్‌లో పత్తికి బదులు ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించింది. సబ్సిడీలు సైతం ప్రకటించింది. పత్తి పంటను దాదాపు సగానికి సగం తగ్గించాలని ప్రభు త్వం ప్రయత్నించింది. ఆదశలో సాగించిన ప్రయత్నాలు ఫలించాయి. ఈసారి ఐదు లక్షల హెక్టార్లలో పత్తి పంటకు బదు లు రైతులు సోయాబిన్, ఇతర పం టలు వేసినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. పత్తి సాగు నుంచి పక్కకు తప్పుకున్న రైతుల్లో రెండున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 520 గ్రామా ల్లో దాదాపు పదివేల మంది రైతులు 45వేల ఎకరాల విస్తీర్ణంలో సోయాబిన్ విత్తన ఉత్పత్తి చేస్తున్నారని ఆయన తెలిపారు. పత్తి నుంచి రైతులు సోయాబిన్ విత్తన ఉత్పత్తి సాగుకు మారినందున రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలను క్షేత్ర స్థాయిలో శాస్తవ్రేత్త లు ఇవ్వాలని కోరారు. శనివారం హాకా భవన్‌లో తెలంగాణ విత్తన ఉత్పత్తి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ జిల్లా అధికారులు, శాస్తవ్రేత్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ చర్యలతో నాణ్యమైన సోయాబిన్ విత్తన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు క్షేత్ర స్థాయిలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సెప్టెంబర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోయాబిన్ పంట చేతికి వచ్చే సమయంలో రైతులు తీసుకోవలసిన చర్యలు సూచించాలని కోరారు. మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రైతులు సోయాబిన్ విత్తన ఉత్పత్తి ప్రారంభించినందున ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కమిషనర్ సూచించారు.