S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/18/2016 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 పేపర్ లీక్ కేసులో మరో నిందితుడిని సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్‌కుమార్ సింగ్ (28) ఢిల్లీలో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌లో పనిచేస్తూ, ముకుల్ జైన్ ద్వారా వచ్చిన ఆరుగురు విద్యార్థులకు రెండు సెట్ల ఎమ్సెట్ పేపర్ల ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు.

08/18/2016 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు పోటీగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో జిల్లాలు, ప్రాజెక్టుల వారీగా లెక్కలు చూపించారు.

08/17/2016 - 17:53

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమాబేగంను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

08/17/2016 - 17:39

కరీంనగర్: నయీం అనుచరులు రమేష్, గోపికి జగిత్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ ఇద్దరు నిందితులు భూదందా వ్యవహారంలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

08/17/2016 - 16:43

హైదరాబాద్‌: జల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తొందని, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పేందుకే వాస్తవ జలదృశ్యం ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.అసెంబ్లీ సాక్షిగా సీఎం అనేక అబద్దాలను వాస్తవాలుగా చెప్పారని, వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పేందుకు వాస్తవ జలదృశ్యం ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

08/17/2016 - 16:16

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ వ్యక్తిగత కార్యదర్శి పద్మావతిని ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి పేషీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పద్మావతి తమను వేధింపులకు గురిచేస్తున్నాని ఆరోపిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

08/17/2016 - 15:56

హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ పర్సనల్‌ సెక్రటరీ పద్మావతిని ప్రభుత్వం బదిలీ చేసింది. పద్మావతి వేధిస్తోందంటూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఉదయం కూడా నిరసనకు దిగారు. పీఎస్‌గానే వేధిస్తున్న పద్మావతిని అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమిస్తే వేధింపులు ఎక్కువ అవుతాయని ఉద్యోగులు ఆరోపించారు.ఆమెను తొలగించకుంటే పెన్ డౌన్‌కు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు.

08/17/2016 - 15:42

హైదరాబాద్‌: కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి కేబినెట్‌ సబ్‌- కమిటీ చైర్మన్ మహమూద్‌ అలీ, సీఎస్ రాజీవ్‌శర్మ హాజరయ్యారు.

08/17/2016 - 15:40

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరు నిందితులు నేపాల్‌లో తలదాచుకున్నట్లు సమాచారం సీఐడీ బృందం నేపాల్‌కు బయలుదేరింది.

08/17/2016 - 15:23

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలులో ఉన్న నయీం అనుచరులు ఫర్జానా, అఫ్సానాలను నార్సింగ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 22వ తేదీ వరకు ఆరురోజుల పాటు వీరిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నయీంకు ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో వీరిని అక్కడకు తీసుకెళ్లి విచారించనున్నట్లు సమాచారం.

Pages