S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2016 - 15:08

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ అయ్యింది. టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నిరంజన్‌‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగరెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచందర్ రావు, మల్లారెడ్డి హాజరయ్యారు.

08/20/2016 - 14:33

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే ఏఎన్‌ఎంలు శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించారు. ప్రస్తుత ప్రభుత్వం తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.

08/20/2016 - 13:01

హైదరాబాద్‌: 70 ఏళ్ల స్వాతంత్య్రం, అమరవీరుల త్యాగఫలం అనే నినాదంతో నగరంలో శనివారం తిరంగా రన్‌ అట్టహాసంగా జరిగింది.కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రన్‌ ప్రారంభించారు. ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌ వరకు రన్‌ కొనసాగింది. పలువురు జవాన్లతో పాటు క్రీడాకారులు, భాజపా ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

08/20/2016 - 12:52

హైదరాబాద్‌: తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శనివారం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసనకు దిగింది.

08/20/2016 - 12:43

వరంగల్ : జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటిస్తున్నారు. సినిమా హాల్స్, పెట్రోల్ బంక్‌లు, విద్య, వ్యాపార సంస్థలు మూసివేశారు.

08/20/2016 - 12:40

ఖమ్మం: నయీం కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి శనివారం డిమాండ్ చేశారు. ఈ కేసు వివరాలను సిట్ లీక్ చేస్తోందని ఆయన ఆరోపించారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పదవులు పొంది ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

08/20/2016 - 12:37

కరీంనగర్: సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ శనివారం అఖిలపక్షం ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్, కేటీఆర్ భారీ కటౌట్‌లకు నిప్పంటించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. అంబేద్కర్ చౌక్ వద్ద కేటీఆర్ ఫ్లెక్సీపై ఆందోళనకారులు పేడ విసిరారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వేములవాడ పోలీస్‌‌స్టేషన్‌కు తరలించారు.

08/20/2016 - 12:32

కరీంనగర్: హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిపక్షం ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటిస్తున్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

08/20/2016 - 11:55

మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం సతీసమేతంగా అలంపూర్ సమీపంలోని గొందిమళ్ల ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. ఇదే ఘాట్‌లో పుష్కరాల తొలిరోజున సిఎం కెసిఆర్ దంపతులు పుష్కర స్నానం చేశారు. పుణ్యస్నానం అనంతరం గవర్నర్ దంపతులు అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శతచండీయాగంలో గవర్నర్ పాల్గొన్నారు.

08/20/2016 - 07:35

బద్రాచలం, ఆగస్టు 19: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల విధ్వంస వ్యూహాన్ని పోలీసులు తిప్పికొట్టారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని చెరీబేడా గ్రామం వద్ద రహదారి పక్కన మావోయిస్టులు అమర్చిన 10 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించాయి. బాంబు డిస్పోజల్ టీం అక్కడకు చేరుకుని మందుపాతరను నిర్వీర్యం చేశాయి.

Pages