S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2016 - 11:41

ఖమ్మం: హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారు జామున నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి పదిమంది మృత్యువాత పడ్డారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద వంతెనపై నుంచి ఈ బస్సు సాగర్ ఎడమకాల్వలో బోల్తాపడింది. సంఘటన స్థలంలో ఏడుగురు, ఆసుపత్రిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 18 మందిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

08/22/2016 - 11:40

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్న షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

08/22/2016 - 07:56

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగు దేశం పార్టీ కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటైంది. అన్ని నూతన హంగులతో ఏర్పాటైన కార్యాలయాన్ని ఆదివారం టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

08/22/2016 - 07:55

హైదరాబాద్, ఆగస్టు 21:గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య చారిత్రక ఒప్పందం కుదిరే రోజున కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరమని టిఆర్‌ఎస్ ఎంపి బి వినోద్ విమర్శించారు. వినోద్ విలేఖరులతో ఆదివారం మాట్లాడారు.

08/22/2016 - 07:49

హైదరాబాద్, ఆగస్టు 21: గోదావరి నదీ జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న చేసుకోనున్న ఒప్పందాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె.

08/22/2016 - 07:23

హైదరాబాద్, ఆగస్టు 21: కృష్ణాపుష్కరాలకు జనం బారులు తీరడంతో కృష్ణమ్మ పులకిస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అన్నిఘాట్‌లు జనసందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది ప్రారంభమయ్యే తంగడి మొదలుకుని నల్లగొండ జిల్లా మట్టపల్లి వరకు ఏర్పాటు చేసిన దాదాపు 90 ఘాట్లు జనం ఇసుకవేస్తేరాలనంత విధంగా మారాయి.

08/22/2016 - 07:22

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో వారం రోజుల నుండి వానలు లేకపోవడంతో చెల్క, ఇసుకభూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు వారం రోజుల నుండి నీళ్లు లేకపోతే పంట వాడిపోతోంది. ఈ పరిస్థితి ప్రధానంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు నల్లగొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంది. వానలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

08/22/2016 - 07:21

సూర్యాపేట, ఆగస్టు 21: వ్యాపారాలు లాభాల కోసం చేసేవే అయినా ప్రజలకు వివిధ రకాల వస్తుసేవలను అందిస్తున్నందున వ్యాపారాన్ని సేవారంగంగా భావించాలని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన మర్చంట్స్‌డే కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిధిగా హాజరై ప్రసంగించారు.

08/22/2016 - 07:20

దేవరకొండ, ఆగస్టు 21 : కృష్ణా పుష్కరాల్లో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాసరాజ్‌పల్లి పుష్కరఘాట్ వద్ద సాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ముత్తినేని హార్తిక్ (12) నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

08/22/2016 - 07:20

ఆసిఫాబాద్, ఆగస్టు 21: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మధ్య నెలకొన్న వివాదం ఆదివారం తాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేయాలని సబ్‌కలెక్టర్ ఆదేశించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయంది.

Pages