తెలంగాణ

‘మహా’ ఒప్పందం..మహా ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: గోదావరి నదీ జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న చేసుకోనున్న ఒప్పందాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి ప్రభృతులు సమావేశమై మంతనాలు జరిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 23వ తేదీన నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహించాలని జిల్లా పార్టీ నాయకులను ఆదేశించారు. మహారాష్టత్రో కుదుర్చుకోనున్న ఒప్పందంతో తెలంగాణకు కలిగే నష్టంపై కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.