తెలంగాణ

మీరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21:గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్టల్ర మధ్య చారిత్రక ఒప్పందం కుదిరే రోజున కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరమని టిఆర్‌ఎస్ ఎంపి బి వినోద్ విమర్శించారు. వినోద్ విలేఖరులతో ఆదివారం మాట్లాడారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే వినే ఓపిక లేకుండా వెళ్లిపోయారని, విని ఉంటే కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టుల గురించి అవగాహన వచ్చేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కాగితాలపై నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు ఉపయోగపడవో ముఖ్యమంత్రి వివరంగా చెప్పారన్నారు. తమ బం డారం బయటపడుతుందని కాం గ్రెస్ సభ్యులు సభలో లేరని అ న్నారు. కేంద్రంలో మన్మోహన్‌సింగ్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో అటు మహారాష్టల్రో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంద ని.. మరి ఆ సమయంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ము ఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎల్లుండి మంత్రులు, అధికారుల బృందం మహారాష్ట్ర వెళ్లి ఒప్పందాలు చేసుకోవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఆనందిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నందుకు అభినందించాలి లేకపోతే ఊరుకోవాలి కానీ పనికిరాని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.