తెలంగాణ

ఎమ్మెల్యే-సబ్‌కలెక్టర్ మధ్య ముదిరిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఆగస్టు 21: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మధ్య నెలకొన్న వివాదం ఆదివారం తాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేయాలని సబ్‌కలెక్టర్ ఆదేశించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయంది. మాజీ గిరిజన మంత్రి విగ్రహం ఏర్పాటు కోసం పెద్దవాగు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో పనులు చేపట్టిన జెసిబి, ట్రాక్టర్‌ను ఇదివరకే సీజ్ చేసిన సబ్‌కలెక్టర్, ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అంతటితో ఆగని అద్వైత్ కుమార్ సింగ్ మరో అడుగు ముందుకేసి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ధ్వంసం చేశారంటూ టిఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు గాదెవేని మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగిల్ విండోచైర్మన్ అలీబిన్ అహ్మద్‌లపై ఆదివారం ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఇన్‌చార్జి తహశీల్దార్‌తో ఫిర్యాదు చేయించారు. దీంతో పాటు పనులు నిలిపివేసే సమయంలో వాగ్వాదానికి దిగిన పలువురు తెరాస కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ తాజా పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే తన తండ్రి దివంగత భీంరావు విగ్రహం కోసం చేయిస్తున్న పనులను సబ్‌కలెక్టర్ అడ్డుకోవడాన్ని అవమానంగా భావిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి తాజా కేసులపై తాడోపేడో తేల్చుకునేందుకు ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. మంత్రులు, జిల్లా అధికారుల వద్ద జరిగిన విషయాలను వివరించినట్లు సమాచారం. తన తండ్రి విగ్రహం ఏర్పాటు విషయంలో పనులు నిలిపి వేసి అనుమతుల కోసం వేచిచూస్తున్న తమ కార్యకర్తలపై కేసుల నమోదు చేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆదివాసీలంతా ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని మంత్రి రామన్న, అధికారుల వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఐఎఎస్ అధికారి మధ్య నెలకొన్న వివాదం చివరకు ఎటువైపు దారి తీస్తుందో అన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది.