తెలంగాణ

ఎన్టీఆర్ భవన్‌లో టిటిడిపికి కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగు దేశం పార్టీ కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటైంది. అన్ని నూతన హంగులతో ఏర్పాటైన కార్యాలయాన్ని ఆదివారం టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వరకూ సైకిల్ ర్యాలీగా వచ్చారు. లోగడ టిఆర్‌ఎస్‌లో చేరి తిరిగి పార్టీలోకి వచ్చిన నాయకుడు ప్రదీప్‌కు, ఇతర నాయకులకు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎల్. రమణ ప్రసంగిస్తూ టిడిపి అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. దారి తప్పిన వారంతా వెనక్కి రండి..
రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ వివిధ కారణాలతో లోగడ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన నాయకులు, కార్యకర్తలంతా తిరిగి సొంత గూటికి రావాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి అంతా టివీ, పత్రికల్లో త్రీడీ బొమ్మల్లా యాడ్స్ రూపంలో కనిపిస్తున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు.