తెలంగాణ

తెలంగాణకు గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఒలింపిక్స్‌లో పివి సింధు రజత పతకాన్ని గెలుచుకోవడం దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. ఒలింపిక్స్‌లో తొలి రజత పతకాన్ని దక్కించుకున్న మహిళగా సింధు చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సింధుకు శిక్షణ ఇచ్చిన పుల్లెల గోపిచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తమ ప్రభుత్వం యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు.
స్ఫూర్తిదాయకం: బాబు
విజయవాడ (స్పోర్ట్స్),:తెలుగుతేజం పివి సింధుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఆటలో సింధు చూపిన పోరాట పటిమ నూరుకోట్ల భారతీయులకు స్ఫూర్తి నింపిందన్నారు. స్వర్ణం కోసం తుది వరకు పోరాడిన సింధు తెలుగు యువతరానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంచించారు. రియోలో సింధు ప్రదర్శన యావద్దేశానికి కొండంత బలాన్నిచ్చిందని, సింధును పైనల్స్ వరకు చేర్చిన ఆమె గురువు పుల్లెల గోపిచంద్‌ను చంద్రబాబు ఆభినందించారు. తన హయాంలోనే హైదరాబాద్‌లో గోపిచంద్ అకాడమీకి స్థలం కేటాయించి ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
మరెన్నో విజయాలకు నాంది: జగన్
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెల్చుకున్న పివి సింధుకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాంది పలికే అద్భుతమైన, స్ఫూర్తివంతమైన విజయమని అభివర్ణించారు.

మ్యాచ్ అనంతరం బ్రెజిల్‌లో పి.వి.సింధు, గోపీచంద్‌ను అభినందిస్తున్న తెలంగాణ మంత్రి పద్మారావు