తెలంగాణ

సిఎంకు నడిగడ్డపై ఎందుకింత వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 19: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోందని, గతంలో 14 జిల్లాలు అంటూ నేడు 17 జిల్లాలకు పెంచినప్పటికీ గద్వాల పేరు లేకపోవడం బాధాకరమని, ముఖ్యమంత్రికి నడిగడ్డపై ఎందుకింత వివక్ష అని మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ప్రశ్నించారు. శుక్రవారం గద్వాలలోని డికె సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి తరువాత అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, అందుకు అను గుణంగా అధికారులు నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ మూడు జిల్లాలతో సరిపెట్టి గద్వాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం రాజకీయ దురుద్దేశం, ఈ ప్రాంతంపై ఉన్న వివక్ష కారణంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అగ్నిగుండం అవుతుందని ఆమె హెచ్చరించారు. కొత్త జిల్లాల్లో వనపర్తి, నాగర్‌కర్నూల్ పక్కపక్కనే ఉన్నప్పటికీ వాటిపేర్లు ప్రకటించడం బాధాకరమని, గద్వాల చరిత్ర, సంస్థానం, అర్హతలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ నడిగడ్డలో విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పుష్కర భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల బంద్‌పై ఎక్కువ శ్రద్ధ చూపలేదన్నారు. అన్నివర్గాల ప్రజలు, కార్మికులు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా తరలిరావడం, వ్యాపార వర్గాలు సైతం బంద్‌కు మద్దతు తెలపడం శుభసూచకమన్నారు. ప్రభుత్వం ప్రకటించి కొత్త జిల్లాల ప్రకటనలో గద్వాల పేరు లేకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని ప్రకటించారు. నడిగడ్డ ప్రజల ఆగ్రహావేశాలతో నడిగడ్డ అగ్నిగుండం కాకముందే సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా బంద్ విజయవంతం పట్ల అఖిలపక్ష కమిటీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కలిసొచ్చిన అందరికీ మరోసారి అభినందనలు తెలుపుతూ మరిన్ని ఉద్యమాలు చేపట్టేందుకు కృషి చేద్దామన్నారు.

విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డికె అరుణ

మందుపాతర నిర్వీర్యం
మావోల చెర నుండి గిరిజనులు విడుదల
భద్రాచలం, ఆగస్టు 19: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల విధ్వంస వ్యూహాన్ని పోలీసులు తిప్పికొట్టారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని చెరీబేడా గ్రామం వద్ద రహదారి పక్కన మావోయిస్టులు అమర్చిన 10 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించాయి. బాంబు డిస్పోజల్ టీం అక్కడకు చేరుకుని మందుపాతరను నిర్వీర్యం చేశాయి. ఆ మార్గంలో పోలీసు బలగాలు వెళ్తున్నాయని గమనించి వారిని మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే రాష్ట్రంలోని కొండెగావ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు మహిళా నక్సల్స్‌తో సహా 9 మంది మావోయిస్టులు ఐజీ కల్లూరి, ఎస్పీ సంతోష్‌సింగ్ ఎదుట లొంగిపోయారు. వీరంతా ఈ జిల్లాలోని ఈరాగావ్, బడేడోంగ్రీ, బయానార్ ప్రాంతాలకు చెందిన వారు. వీరిపై అనేక కేసులు ఉన్నాయి. వీరికి పునరావాసం కల్పిస్తామని ఐజీ కల్లూరి తెలిపారు. మరో వైపు భద్రాచలం సరిహద్దున ఉన్న విలీన చింతూరు మండలం పేగా గ్రామం నుంచి గత మంగళవారం మావోయిస్టులు అపహరించిన గిరిజనులకు దేహశుద్ధి చేసి విడుదల చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారొద్దని వారిని హెచ్చరించినట్లు సమాచారం. కిడ్నాప్‌నకు గురైన నలుగురు కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడె ముద్దయ్యలు ఇళ్లకు చేరుకున్నారు. దీంతో పేగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

మావోల చెర నుంచి విడుదలైన నలుగురు గిరిజనులు