తెలంగాణ

వర్షాధార పంటలపై రైతుల ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రాజెక్టులు లేకపోవడంతో.. కేవలం వర్షాధారంపై ఆధారపడి మాత్రమే తెలంగాణ ప్రజలు పంటలు పండించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పోచారం కృష్ణ పుష్కరాలకు వెళ్తూ మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల సమీపాన ఎంపి జితేందర్ రెడ్డి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతన్నలు అనుక్ను దానికంటే మెట్టపంటలు ఎక్కువగా వేశారని, ఆముదం, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుముల పంటలను విస్తృతంగా సాగు చేశారు. వాటికి ఇన్సురెన్స్ కోసం ప్రభుత్వం ఈనెల 10 నాటికి ఇచ్చినప్పటికి మరో నెల రోజులు గడువు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో రైతులు పత్తి పంటలు తగ్గించడంతో రాబోయే రోజుల్లో తెల్లబంగారానికి అధిక ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి 90శాతం సబ్సిడితో చిన్న, సన్నకారు రైతులకు డ్రిప్ పైపులు అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. వర్షాపాతం తక్కువగా ఉనందున రైతులు మెట్ట పంటలను ఎంచుకోవాలని ఆయన కోరారు. రైతులకు తగిన స్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచామని, గత ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండేదని కెసి ఆర్ ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కెసి ఆర్ రైతుల కోసం ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు పాలమూరు జిల్లాలో కర్వెనా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సంవత్సరం కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల నుండి గ్రామాల్లోని చెరువులకు నీరు నింపడం జరిగిందని దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు ఉన్నారు.