తెలంగాణ

కృష్ణమ్మ నీటి వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 19: కృష్ణానది నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. తంగిడిగి పుష్కర ఘాట్ నుండి మొదలుకుని రంగాపూర్ , బీచుపల్లి పుష్కర ఘాట్ వరకు కృష్ణానది వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ పుష్కర ఘాట్లలో మెట్లు రోజురోజుకు తేలిపోతున్నాయి. మరోపక్క శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరగడంతో జోగులాంబ, సోమశిల పుష్కర ఘాట్లకు పుష్కర ఘాట్లలలో మాత్రం కృష్ణమ్మ జలాలు నిండుకుండలా ఉన్నాయి. దింతో జోగులాంబ, సోమశిల పుష్కర ఘాట్లకు జనప్రవాహం వరద వస్తుంది. శుక్రవారం కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని పుష్కర ఘాట్లలో కలిపి దాదాపు 15 లక్షలకు పైగానే భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించాయి. కృష్ణానది తీరాన ఎటుచూసినా జనప్రవాహం కనిపించడంతో పుష్కర ఘాట్లు కళకళలాడుతున్నాయి. జోగులాంబ పుష్కర ఘాట్ దగ్గర అలలు ఎగిసిపడుతూ పుష్కర ఘాట్ల మెట్లకు తాకుతున్నాయ. ఆ అలల జల్లులు ఒక్కసారిగా ఐదారు ఫీట్ల ఎత్తులో వచ్చి ఘాట్లలో ఉన్న భక్తులపై చిరుజల్లులు పడుతుండడంతో భక్తులు పరవశించిపోతున్నారు. జోగులాంబ పుష్కర ఘాట్‌లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఐదవశక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంలో శతచండీయాగం రెండవ రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు జోగులాంబ పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం చండీయాగంలో పాల్గొని జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఐదవశక్తిపీఠానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సోమశిల పుష్కర ఘాట్లలో కూడా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. టిజెఎసి చైర్మన్ కోదండరాం, మాజి మంత్రి నాగం జానార్దన్‌రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావులు సోమశిలలో పుణ్యస్నానాలు చేశారు. రంగాపూర్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ నరసింగరావు కుటుంబసభ్యులు పుణ్యస్నానాలు చేశారు. అదేవిధంగా బీచుపల్లి ఘాటుకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి పలు ఘాట్లను సందర్శించారు.
ఎస్‌ఐ మృతిపై
సమగ్ర విచారణ
నిజామాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి
సిద్దిపేట టౌన్, ఆగస్టు 19: కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లాఅదనపుఎస్‌పి, కేసు విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం సిద్దిపేట డిఎస్పీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీసుస్టేషన్‌లో రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కేసుపట్ల పూర్తి సమాచారం సేకరిస్తున్నామన్నారు. మృతి చెందిన ఎస్‌ఐ కుటుంబ సభ్యులు, మిత్రులు, బ్యాచ్ మెంట్స్‌ను విచారిస్తున్నామన్నారు. వారి వద్ద నుంచి పూర్తి వివరాలు తీసుకొని దర్యాప్తు చేస్తామన్నారు. ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. సూసైడ్ నోట్‌లో ఎస్‌ఐ పేర్కొన్న అధికారులు డిఎస్పీ, సిఐ, కానిస్టేబుల్‌లను విచారణ చేస్తున్నామన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామన్నారు.