S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/17/2015 - 06:46

ఏలూరు, డిసెంబర్ 16: కాల్‌మనీ వ్యవహారం విజయవాడలో వెలుగుచూసిన నేపధ్యంలో జిల్లాలోనూ ఆప్రభావం గట్టిగానే కన్పిస్తోంది. ఇంతవరకు తమలోతాము మదనపడుతూ వస్తున్న బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి మరీ తమ స్వరాన్ని విన్పిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో వడ్డీరాకాసుల సంఖ్య దారుణంగానే కన్పిస్తోంది. ఆ వూరు, ఈ వూరు అని లేకుండా సర్వాంతర్యామి తరహాలో ఈ వడ్డీరాకాసులు వెలుగుచూస్తున్నారు.

12/17/2015 - 06:44

ఒంగోలు/మదనపల్లె/కర్నూలు, డిసెంబర్ 16: రాష్టవ్య్రాప్తంగా కాల్‌మనీ వ్యవహరం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పోలీసులు ముమ్మరంగా వడ్డీవ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో రెండు కేసులు, కొమరోలులో ఒకకేసు నమోదు అయింది.

12/17/2015 - 06:43

రాజంపేట, డిసెంబర్ 16: డాక్టర్లు చనిపోయిందన్న వృద్ధురాలు లేచి కూర్చున్న సంఘటన కడప జిల్లా రాజంపేటలో బుధవారం జరిగింది. రాజంపేట మండలం ములక్కాయలపల్లెకు చెందిన నిమ్మరాజు గాయత్రి(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా బంధువులు బుధవారం తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

12/17/2015 - 06:40

విశాఖపట్నం/విజయనగరం/శ్రీకాకుళం, డిసెంబర్ 16: ఉత్తరాంధ్రలో వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

12/17/2015 - 06:31

తిరుచానూరు, డిసెంబర్ 16: లక్షలాది భక్తజన సందోహం గోవింద నామస్మరణల మధ్య బుధవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం కన్నుల పండువగా జరిగింది. మూడు లక్షల మందికి పైగా భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో జరిగే చక్రస్నానం రోజున పుణ్యస్నానం ఆచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

12/17/2015 - 06:36

రాజమండ్రి, డిసెంబర్ 16: కాల్‌మనీ కుంభకోణంలో మరో కొత్త కోణమిది. అప్పు తీసుకుంటున్న వారి నుండి వడ్డీ వ్యాపారులు ముందుగానే వకాల్తా పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా సంతకాలు తీసుకుని అప్పు తీసుకున్న వారి తరపున కూడా తమ న్యాయవాదినే ఏర్పాటుచేసి, ఆస్తులను కొల్లగొడుతున్నారు. అప్పు ఇచ్చేటపుడు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతాలు చేయించుకోవటం మాత్రమే ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం.

12/17/2015 - 05:34

హైదరాబాద్, డిసెంబర్ 16: అధికార, విపక్షాలు పరస్పరం కత్తులు దూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి వాడివేడిగా మొదలుకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమతమ పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశమై వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలపై కసరత్తు జరిపారు.

12/17/2015 - 05:28

విజయవాడ, డిసెంబర్ 16: రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్‌మనీ లైంగిక వేధింపులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో కేబినెట్ సమావేశమైంది. ముందుగా కాల్‌మనీ లైంగిక వేధింపుల అంశంపై తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది.

12/17/2015 - 05:25

సూళ్లూరుపేట, డిసెంబర్ 16: రోదసీ ప్రయోగాల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాము సాధించిన నిరుపమాన ప్రజ్ఞాపాటవాలను ఇస్రో శాస్తవ్రేత్తలు చాటిచెప్పారు. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను పోలార్ ఉపగ్రహ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి-సి 29) ద్వారా రోదసీ కక్ష్యలోకి బుధవారం దిగ్విజయంగా ప్రవేశ పెట్టగలిగారు.

12/17/2015 - 05:23

హైదరాబాద్, డిసెంబర్ 16: తక్షణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ 4 టిఎంసిల జలాలు వాడుకోవడానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆమోదం తెలిపింది.

Pages