S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/17/2015 - 05:16

విజయవాడ, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల నుండి పారిశ్రామిక ఔత్సాహికులను తయారుచేయడం కోసం ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తీసుకురావాన్నదే ప్రభుత్వ సంకల్పమని, పెద్ద ఎత్తున రుణాలు సమకూర్చి ఈ లక్ష్యసాధనలో ప్రభుత్వానికి సహకరించాలని సిఎం కోరారు.

12/16/2015 - 18:16

శ్రీహరికోట: నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ29(పీఎస్‌ఎల్వీ-సీ29) నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి ఈ సాయంత్రం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ 29 మోసుకెళ్తుంది.

12/16/2015 - 17:06

హైదరాబాద్‌ : కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో ముగిసింది. తాగునీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు కేటాయించారు. అత్యవసరంగా నాలుగు టీఎంసీలు వాడుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీశైలం డ్యాం పటిష్టతకు చర్యలు చేపట్టాలని బోర్డు ఆదేశించింది. తదుపరి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు.

12/16/2015 - 16:43

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలలో ప్రైవేటు వర్శిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను మంత్రి విలేకరులకు వివరించారు. మనీలాండరింగ్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలిగే కాల్‌మనీ వ్యవహరంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించనున్నట్లు తెలిపారు.

12/16/2015 - 14:20

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పేపర్ ప్లేట్లతో చేసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాబు వచ్చే జాబు రాకపాయే.., గబ్బర్ సింగ్ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలియజేశారు.

12/16/2015 - 14:07

హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్ మనీ ఆగడాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవాని అన్నారు. బుధవారం హైదరాబాద్ లో గంగాభవాని విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే టీడీపీ నేతలు కాల్ మనీ అరచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

12/16/2015 - 07:45

హైదరాబాద్, డిసెంబర్ 15: విద్యుత్ పొదుపులో దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో విద్యుత్‌ను ఆదా చేసినందుకు భారత రైల్వే శాఖ ప్రకటించిన 24 అవార్డుల్లో ఏడు అవార్డులు దక్షిణ మధ్య రైల్వే దక్కించుకుందని ముఖ్య ప్రజా సంబంధాల శాఖ అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు.

12/16/2015 - 07:39

హైదరాబాద్, డిసెంబర్ 15: దక్షిణ మధ్య రైల్వే పింఛన్‌దారుల సమస్యలను పరిష్కరిస్తామని అదనపు జనరల్ మేనేజర్ ఎస్‌ఎన్ సింగ్ హామీ ఇచ్చారు. మంగళవారం సికిందరాబాద్‌లోని రైల్వే నిలయంలో 30వ పెన్షన్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగ్ మాట్లాడుతూ రిటైరయిన కార్మికుల కుటుంబాలు పింఛన్‌పై ఆధారపడి ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చెల్లింపులు జరగాలని అకౌంట్స్ విభాగం అధికారులను అదేశించారు.

12/16/2015 - 07:33

సింహాచలం, డిసెంబర్ 15: కృతయుగ దైవం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుతీరివున్న సింహాచలం దేవాలయం అంతరాలయం స్వర్ణకాంతులతో శోభిల్లనుంది. స్వామివారికి అత్యంత సమీపంలో పైభాగంలో ఉన్న మరో మండపానికి బంగారు తాపడం పనుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమయింది. చెన్నై నుండి వచ్చిన ప్రత్యేక బృందం ప్రస్తుతం ఉన్న వెండి రేకులను తొలగించి కొలతలను సేకరించారు.

12/16/2015 - 07:31

విశాఖపట్నం, డిసెంబర్ 15: శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ సోమవారం ఏసిబికి చిక్కిన బాలా నాయక్ ఆస్తి సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2006కు ముందే బాలా నాయక్ పెద్ద ఎత్తున అక్రమార్జన చేశాడు.

Pages