రాష్ట్రీయం

ఆంధ్రకు 4 టిఎంసిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తక్షణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ 4 టిఎంసిల జలాలు వాడుకోవడానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 30 టిఎంసిల నుంచి ఆంధ్రప్రదేశ్ 10 టిఎంసిలు, తెలంగాణ 20 టిఎంసిల నీటిని వాడుకోవచ్చని గత బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని, యథాతథిస్థితి కొనసాగుతుందని మరోసారి బోర్డు స్పష్టం చేసింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె పండిత్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో బోర్డు సమావేశం జరిగింది. ఆంధ్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధిత్యనాథ్ దాసు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదలరంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇఎన్‌సిలు సమావేశానికి హాజరయ్యారు. కృష్ణానదీ జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించే అంశాలపై బోర్డు ప్రధానంగా చర్చించింది. ఆంధ్ర రాష్ట్రానికి గతంలో కేటాయించిన 10 టిఎంసిలలో అత్యవసరమైతే తాగునీటి అవసరాల కోసం తక్షణం 4 టిఎంసిల నీటిని వాడుకోవచ్చని బోర్డు నిర్ణయించింది. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టునుంచి 10 టిఎంసిల నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని బోర్టు స్పష్టం చేసింది. అలాగే కృష్ణానది నుంచి హైదరాబాద్ నగర తాగునీటి కోసం నీటి లభ్యత సామర్థ్యం మేరకు వాడుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైంలో ప్రాజెక్టు డ్యామ్ భద్రతపై కేంద్ర జల సంఘానికి లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీవేసి డ్యామ్‌కు అవసరమైన మేరకు మరమ్మతులు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ నీటిపారుదలరంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. కృష్ణానది జలాలను వినియోగించుకునే అంశంపై ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని బోర్డు సూచించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తదుపరి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని వచ్చిన ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలిపారు. హైదరాబాద్‌లో కృష్ణాబోర్టు కార్యాలయం ఏర్పాటుతోపాటు బోర్డు బడ్జెట్, నిధుల కేటాయింపు అంశంపై సమావేశంలో చర్చజరిగినట్టు విద్యాసాగర్‌రావు తెలిపారు.