రాష్ట్రీయం

శ్రీశైలంలో పాక్షిక సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు పరోక్ష ఆర్జిత సేవలను ప్రవేశపెట్టినట్లు ఈఓ రామారావు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఈఓ పరోక్ష ఆర్జితసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి స్వయంగా రాలేని భక్తులు అన్‌లైన్‌లో సేవా రుసుం చెల్లించి ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకోవచ్చుని తెలిపారు. ఈ పరోక్ష ఆర్జిత సేవల్లో గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణేశ్వర స్వామి కల్యాణం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కల్యాణం తదితర సేవలను అర్చకులు, వేదపండితులు భక్తుల పేర నిర్వహిస్తారన్నారు. ఈ పరోక్ష ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు రూ.1,116 ఆన్‌లైన్, ఫోన్ పే, గూగుల్ పేలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. దేవస్థానం యూట్యూబ్ ద్వారా ఆయా సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారన్నారు. దేవస్థానం కాల్‌సెంటర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చన్నారు.
*చిత్రం... శ్రీశైలంలో హోమం చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి