రాష్ట్రీయం

మాజీ సీఎం చంద్రబాబు సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహామ్మారిని స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను దూరంచేయవచ్చునన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో విజయవంతం చేశారు. ఇటు మంత్రులు, అటు అధికారులు జనతా కర్ప్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటి ముందు కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి జనతా కర్ఫ్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి జనతా కర్ఫ్యూకు సంఘీభావం చెబుతూ చప్పట్లు కొట్టారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టస్‌లో సత్తపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కర్ఫ్యూకు మద్దద్తగా సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సంస్థ సిబ్బంది జనతా కర్ఫ్యూను సక్సెస్ చేసిందని సంస్థ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా ఇంటి పట్టునే ఉండిపోయారు. తన కుటుంబ సభ్యులతో కరోనా వైరస్ నివారణకు స్వీయ నియంత్రణకు మద్దత్తు పలికారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేయడానికి ప్రజలు కంకణబద్దులు కావాలని పిలుపు ఇచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. జనతా కన్ఫ్యూ విజయవంతం చేసినందకు మంత్రులు చప్పట్ల కొట్టారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. విద్యుత్ రంగానికి చెందిన ట్రాన్సికో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్వీయ నియంత్రణలో భాగంగా ఇంటిపట్టునే ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా అధికారులతో పర్యవేక్షించారు. డిస్కంమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావులు తమ పరిధిలో ఉన్న అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ విద్యుత్ నిరంతరం సరఫరా చేయడానికి సూచనలు ఇచ్చారు. రైల్వే నిలయంలో రైల్వే అధికారులు జనతా కర్ఫ్యూకు సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ దక్షిణ మధ్య రైల్వే పరిస్థితిపై సమాచారం అందించారు. కరోనా వైరస్ నివారణ కోసం వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేమని పౌర సమాజం అభినందించంది.

*చిత్రం... జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతున్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు