రాష్ట్రీయం

నిశ్శబ్ధంలో తిరునగరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరిలో భక్తుల గోవింద నామస్మరణలు లేవు. వాహనాల శబ్ధాలు లేవు....రైలు కూతలు లేవు.వీధుల్లో జనసంచారం లేదు. దుకాణాలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో వ్యాపార వాణిజ్యాలు నడవలేదు. ఏ వీధిచూసినా, ఏ వాడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా మారి తిరుమల, తిరుపతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా అని ఏ సూర్యగ్రహణమో పట్టలేదు. రాజకీయ నాయకులు బంద్‌కు పిలుపునివ్వలేదు. కేవలం కరోనా వైరస్ నివారణకు సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ 14 గంటల పాటు జనతా కర్ప్యూను పాటించాలంటూ ఇచ్చిన ఒకే ఒక పిలుపు జనారణ్యాన్ని నిశ్శబ్ధ అరణ్యంగా మార్చింది. తమ జీవితంతో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కురువృద్ధులు చెప్పడం విశేషం. మొత్తం మీద కరోనా వైరస్ పైన వున్న భయమో.. ప్రధాని నరేంద్ర మోదీ మాట మీద వున్న అపారమైన గౌరవమో..కరోనా వైరస్‌ను తరిమికొట్టాలన్న అంకుఠిత లక్ష్యమో కానీ జనతా కర్ప్యూ మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. గమనించదగ్గ విషయం ఏమంటే బంద్‌లు జరిగినప్పుడు వాటిని అడ్డుకునే పోలీసు యంత్రాంగమే నేడు ప్రజలు రోడ్డపైకి రాకుండా నిరంతరంగా గస్తీ కాసారు. కరోనా వైరస్ నేపధ్యంలోభక్తులు, ప్రజలు, వాహనదారులతో కిటకిటలాడే తిరునగరిలో నిశ్శబ్ధం అలుముకుంది. జనతా కర్ప్యూ సందర్భంగా తిరుపతి రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. పామరుల దగ్గర నుంచి అధికారులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఎవ్వరికి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కొంతమంది ఇళ్ళను శుభ్రం చేసుకుంటే మరికొందరు కుటుంబ సభ్యలతో కలిసి టీవీల ద్వారా దేశంలో జరుగుతున్న వార్తా విశేషాలను తదేకంగా తిలకించారు. ఇలా 14 గంటల పాటు ఎవరికి వారు స్వచ్చంధంగా బంద్ పాటించారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. రైల్వే స్టేషన్, బస్టాండు, వివిధ కూడళ్లు జనం లేక బోసిపోయాయి. అన్ని షాపింగ్ కాంప్లెక్సులు, పెట్రోల్ బంకులు,మాంసం దుకాణాలు, బార్లు, మద్యం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసారు. ఏ రోడ్డు చూసినా ఏ ముంది గర్వకారణం అనే రీతిలో తయారయ్యాయి. చూడాలన్నా జనం కనిపించలేదు. అత్యవసర వాహనాలు మినహాయించి మిగిలిన అన్ని వాహనాలు ఆపేశారు. తిరుపతి నుంచి నిత్యం నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 19 ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా కనిపించింది. అన్ని దుకాణాలు మూతపడ్డాయి. విమానాశ్రయం నుంచి 14 విమాన రాకపోకలు ఆపేసారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మూడు విమానాలను తిప్పారు.

*చిత్రం... జనతా కర్ఫ్యూ కారణంగా భక్తులు లేక నిర్మానుష్యమైన తిరుమల