రాష్ట్రీయం
విశాఖ నుంచి జపాన్ వాసుల పయనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, ఏప్రిల్ 13: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకున్న జపాన్ దేశానికి చెందిన పలువురు సోమవారం నగరం నుంచి బయలుదేరారు. లాక్‌డౌన్‌కు ముందు విశాఖ చేరుకున్న ఆరుగురు జపాన్ దేశస్తులు కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో విశాఖలో చిక్కుకుపోయారు. గత 20 రోజులుగా వీరంతా నగరంలోని ఒక హోటల్‌కే పరిమితమయ్యారు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కు ముందు దేశంలోని వివిధ పట్టణాల్లో పలువురు జపాన్ దేశీయులు చిక్కుకుపోయారు. జపాన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం వీరిని తిరిగి వారి స్వస్థలాలకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. క్వారంటైన్ కాలం పూర్తి కావడంతో విశాఖలో చిక్కుకున్న జపనీయులకు ప్రభుత్వం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది.