రాష్ట్రీయం

భారీగా ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/విజయనగరం/శ్రీకాకుళం, డిసెంబర్ 16: ఉత్తరాంధ్రలో వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. విశాఖ నగరంలో టాస్క్ఫోర్స్ ఎసిపి ఐ చిట్టిబాబు సారథ్యంలో అల్లిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్న రెండు ఫైనాన్స్ సంస్థలపై దాడులు చేశారు. శ్రీ చంద్ర ఫైనాన్స్, శ్రీ వెంకట సాయి ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు నిర్వహించి పెద్ద సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ చంద్ర ఫైనాన్స్ సంస్థ యజమాని గాంధీని అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీసులకు తదుపరి విచారణ నిమిత్తం అప్పగించారు. శ్రీ వెంకటసాయి ఫైనాన్స్ యజమాని నూకరాజు కార్యాలయం నుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులను స్వాదీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్టు ఎసిపి చిట్టిబాబు వెల్లడించారు. అలాగే ఆరిలోవ ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జి రామకృష్ణ అనే వ్యక్తిపై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రామకృష్ణ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అనకాపల్లిలో ఒక వడ్డీ వ్యాపారి నివాసంలో 39 ఖాళీ చెక్కులు, 39 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల విషయం తెలియటంతో పలువురు వడ్డీ వ్యాపారులు పరారయ్యారు. మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి భాస్కరరావు వేధిస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన డొక్కా ప్రసాద్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు ప్రారంభించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు జిల్లాకేంద్రం విజయనగరంతోపాటు బొబ్బిలి, పార్వతీపురం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి నుంచి భారీమొత్తంలో ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆరుగురిని, టూ టౌన్ పరిధిలో ముగ్గురిని, ఎస్.కోట, ఎల్.కోట పరిధిలో ఇద్దరు చొప్పున, కొత్తవలసలో ఒక్కరిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బొబ్బిలిలో ఐదు ఫైనాన్స్ కంపెనీలపై దాడులు జరిపి రికార్డులను అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. సాలూరులో ఒక వడ్డీవ్యాపారి ఇంటిపై దాడి జరిపి రికార్డులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వడ్డీ వ్యాపారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, మరికొందరు వ్యాపారులు తమ లావాదేవీల దస్త్రాలను జాగ్రత్తగా దాచిపెట్టినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళంలోని కంపోస్టు కాలనీ, ద్వారకానగర్‌కు చెందిన కోనాల సత్తిరెడ్డి, కోనాల కామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద సంతకాలతో ఉన్న ఇరవై ఖాళీ ప్రామిసరీనోట్లు, మూడు ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చెరుకూరి అప్పారావు, అలియాస్ అమెరికా అప్పారావు అనే వ్యక్తివద్ద మూడు ఖాళీ ప్రామిసరీనోట్లు, సంతకాలు చేయించుకున్న తెల్ల కాగితాలను, స్టాంపుపేపర్లను స్వాధీనం చేసుకున్నారు.