రాష్ట్రీయం

వడ్డీవ్యాపారులపై కొరడా పలుచోట్ల పోలీసుల సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/మదనపల్లె/కర్నూలు, డిసెంబర్ 16: రాష్టవ్య్రాప్తంగా కాల్‌మనీ వ్యవహరం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పోలీసులు ముమ్మరంగా వడ్డీవ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో రెండు కేసులు, కొమరోలులో ఒకకేసు నమోదు అయింది. వడ్డీవ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి వారివద్ద నుండి విలువైన ప్రాంసరీనోట్లతోపాటు పలు డాక్యుమెంట్లు, ఖాళీ డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌మనీ వ్యవహారం మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. యర్రగొండపాలెం కేంద్రంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన పలువురు ప్రతి మంగళవారం యర్రగొండపాలెం వచ్చి ముందుగా వడ్డీ కట్ చేసుకొని మిగిలిన పైకం ఇచ్చి మొత్తం పైకానికి వారానికోసారి వసూలు చేసుకుంటున్నారు. పుల్లలచెరువు మండలంలో కూడా అదే వ్యవహారం నడుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యర్రగొండపాలెం సిఐ రవికుమార్ మంగళవారం రాత్రి ఆ ప్రాంతానికి చెందిన ఐదుగురు వడ్డీవ్యాపారులను పిలిపించి వారి వ్యాపారం గురించి వివరాలు తెలుసుకొని వదిలివేశారు. బుధవారం ఉదయం మార్కాపురం పట్టణ ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురి ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించి స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కొమరోలు మండలంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఏడుగురి గృహాలపై దాడులు చేశారు. పెనుగొండ సీతారామయ్య ఇంట్లో 30లక్షల విలువ చేసే 42 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరిరోడ్డుకు చెందిన టచ్ ఐస్‌క్రీమ్ పార్లర్ నిర్వాహకులు 15మంది బుధవారం మదనపల్లె డిఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం ఇద్దరు వడ్డీ వ్యాపారుల నుంచి 18 లక్షలు, 40 లక్షలు తీసుకుని సుమారు కోటిన్నర రూపాయల వరకు వడ్డీలు చెల్లించానని, అంతేకాకుండా తనకున్న ఇల్లును మార్టిగేజ్‌పై 1.10 కోట్లు అప్పు ఉన్నట్లు కోర్టులో కేసు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్‌మనీ ప్రకంపనలు కర్నూలు జిల్లాకూ పాకాయి. వడ్డీల పేర సామాన్యులను వేధిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, బేతంచెర్ల, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో బుధవారం పలువురు ఇళ్లు, వ్యాపార సంస్థలపై పోలీసులు దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున ప్రామిసరీ బాండ్లు, ఆస్తి తనఖా పత్రాలు, దినసరి వసూల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
వడ్డీవ్యాపారులపై కేసులు
గుంటూరు: వడ్డీవ్యాపారులపై జిల్లాలోని పలుప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం గుంటూరు నగరంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయటమే కాకుండా ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, దస్తావేజులు స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు తిరిగి బుధవారం జిల్లాలోని వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగించారు. పెద్దఎత్తున దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో సుమారు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేటలో పాలపర్తి శ్రీనివాసరావు, పోలిశెట్టి రవి, షేక్ కాలేషావలి, సతైనపల్లిలో చల్లా సురేష్, షేక్ నాగూర్‌మీరా, పీరు సైదా, వినుకొండలో రామినీడు రామాంజనేయులు, షేక్ మునీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ప్రామీసరి నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

పరశురామునిగా రామయ్య దర్శనం
భద్రాచలం, డిసెంబర్ 16: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం భక్తులకు పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పరశురామావతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా స్వామికి నాళాయర దివ్యప్రబంధం, ద్రవిడ ప్రబంధం పారాయణం చేశారు. వేదవిన్నపాల అనంతరం స్వామి ఊరేగింపుగా మిథిలాస్టేడియానికి చేరుకున్నారు. అక్కడ భక్తులకు దర్శనం ఇచ్చాక తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నారు. నేటి నుంచి ధనుర్మాసోత్సవాల సందర్భంగా తిరుప్పావై ప్రవచనాలు జరగనున్నాయి.

చింటూ అనుచరుల అరెస్ట్..రిమాండ్
చిత్తూరు, డిసెంబర్ 16 : మారణాయుధాలు కలిగి ఉన్నారంటూ చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూకు సంబంధించి ఐదుగురు అనుచరులను బుధవారం చిత్తూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేయర్ దంపతుల హత్య కేసుకు సంబంధం లేకపోయినా బుధవారం అరెస్ట్ చేసిన ఐదుగురితో ఈ కేసులో అరెస్టుచేసిన వారి సంఖ్య 25కు చేరుకుంది. చిత్తూరు మున్సిపల్ మార్కెట్ యార్డు దక్కించుకున్న ధనంజయ, మొగిలి అనుచరులుగా ఉంటూ, మార్కెట్‌లో రోజువారి కలెక్షన్లు చేసే సురేష్, మోహన్, శ్రీనివాసులు, గుణ, ఆసిఫ్ మొహిద్దీన్ అనే ఐదుగురిని మారణాయుధాల కలిగి ఉన్నారన్న అభియోగంపై పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం సాయంత్రం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నాల్గవ అదనపు కోర్టు న్యాయమూర్తి యుగంధర్ నిందితులకు రిమాండ్ విధించారు. ఈ విషయంగా చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సిఐ సూర్యమోహన్‌రావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే మార్కెట్‌లో రోజువారి రుసుము వసూలు చేసే పై ఐదుగురి ఇళ్లను సోదా చేశామన్నారు. ఈ సోదాల్లో వారిళ్లల్లో పలు మారణాయుధాలు తమకు లభ్యమైనట్లు పేర్కొన్నారు.