S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/15/2015 - 03:15

చిత్తూరు, డిసెంబర్ 14: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు పథకం రచించింది, హత్య చేసింది తానేనని చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

12/15/2015 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 14: కేంద్రం పేదరిక నిర్మూలన, నీటి పారుదల, విద్యుత్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సులతో ఏపీలోని ఏడు మిషన్లు సమన్వయపర్చి పనిచేయడం ద్వారా పేదరికంలేని రాష్ట్రంగా ఆంధ్రను తీర్చిదిద్దాలని సిఎం చంద్రబాబు సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఏడు మిషన్ల వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు.

12/15/2015 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆంధ్రలో భూ రికార్డులన్నీ ఆన్‌లైన్ చేయాలని, వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. సర్ట్ఫికెట్లు సైతం ఆన్‌లైన్‌లో జారీచేస్తే పేదలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తారని అన్నారు. భూ రికార్డులను టెలిఫోన్, ఆధార్ నెంబర్లతో అనుసంధానించాలని, మీ ఇంటికి మీ భూమి రికార్డుల్లో లోపాలు సరిదిద్దాలని సూచించారు.

12/14/2015 - 18:22

హైదరాబాద్ : నల్గొండ జిల్లా చౌటుప్పల్ శ్రీని రసాయన పరిశ్రమలో మంటలు చోటుచేసుకున్నాయి. రియాక్టర్ పేలటంతో ఈ ప్రమాదం సంభవించింది. దట్టంగా పొగలు అలుముకున్నాయి.

12/14/2015 - 18:21

శ్రీనగర్ : ఆహారభద్రత బిల్లుకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు.

12/14/2015 - 18:20

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్ చిక్కాడు. నగరంలోని ఎల్బీ నగర్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, రామచంద్ర అనే ఉద్యోగి రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

12/14/2015 - 16:24

హైద‌రాబాద్‌: ఇటుక బట్టీల్లో వలస కార్మికుల దుస్థితిపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కార్మికుల ప్రయోజనాల కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించారు. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.

12/14/2015 - 16:04

హైద‌రాబాద్‌: స‌వ‌తి త‌ల్లి చేతిలో చిత్రహింస‌ల‌కు గురైన ప్రత్యూష కేసు హైకోర్టులో విచార‌ణ జ‌రిపారు. ప్రత్యూష స‌వ‌తి త‌ల్లి ఉంటోన్న ఇల్లు కిరాయి డ‌బ్బులు ఎంత వ‌స్తున్నాయో తెలుసుకుని కోర్టుకు చెప్పాల‌ని ఆదేశించారు. ఆ డ‌బ్బును ప్రత్యూష ఖాతాలో జ‌మ‌చేయాల‌ని పేర్కొన్నారు. త‌దుప‌రి కేసు విచార‌ణ‌ను రెండు వారాలకు వాయిదా వేశారు.

12/14/2015 - 15:39

హైదరాబాద్ :కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు కె.

12/14/2015 - 13:33

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 59 గంటల ప్రక్రియలో బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది.

Pages