రాష్ట్రీయం

వకాల్తాపైనా సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 16: కాల్‌మనీ కుంభకోణంలో మరో కొత్త కోణమిది. అప్పు తీసుకుంటున్న వారి నుండి వడ్డీ వ్యాపారులు ముందుగానే వకాల్తా పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా సంతకాలు తీసుకుని అప్పు తీసుకున్న వారి తరపున కూడా తమ న్యాయవాదినే ఏర్పాటుచేసి, ఆస్తులను కొల్లగొడుతున్నారు. అప్పు ఇచ్చేటపుడు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతాలు చేయించుకోవటం మాత్రమే ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం. వకాల్తాపైనా, కోర్టులో తన వాదన వినిపించేందుకు దాఖలు చేయాల్సిన కాగితాల (కాంక్వెస్ట్)పైనా కూడా సంతకాలు చేయించుకుంటూ వడ్డీ వ్యాపారులు అడ్డూ అదుపూ లేని దౌర్జన్యాలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. అప్పు దొరకడమే మహద్భాగ్యంగా భావించే నిరుపేదలు... వడ్డీ వ్యాపారులు ఎక్కడ చేయమంటే అక్కడ సంతకాలు చేస్తున్నారు. ఇలాంటి దందా గోదావరి జిల్లాల్లో జోరుగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల ఇళ్లు సోదా చేస్తున్నపుడు ఇలాంటి పత్రాలు కూడా ఉంటాయని, వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే వడ్డీ వ్యాపారులు కొత్త కోణంలో సాగిస్తున్న దౌర్జన్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు.
ప్రామిసరీ నోట్ల రిజిస్ట్రేషన్‌తో అక్రమాలకు చెక్
ప్రామిసరీ నోట్లను విధిగా రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చట్టం చేస్తే వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చెప్పారు. పోలీసులు గత రెండు రోజులుగా సాగిస్తున్న సోదాల్లో అప్పు తీసుకున్న వారు సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు బయటపడుతున్నాయని, ఖాళీ ప్రామిసరీ నోట్లతోనే వడ్డీ వ్యాపారులు దోపిడీకి పాల్పతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన ప్రామిసరీ నోట్లు మాత్రమే చెల్లుతాయన్న చట్టాన్ని చేస్తే, ఇలాంటి ఖాళీ ప్రామిసరీ నోట్లకు విలువ లేకుండా పోయి, వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలకు చెక్ పెట్టవచ్చని ముప్పాళ్ల చెప్పారు.

ఇక విజయవాడకు మకాం
ఏపి కాంగ్రెస్ నిర్ణయం
కొత్త సంవత్సరం రోజున ముహూర్తం

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) పార్టీ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు మారబోతున్నది. ఈ ప్రతిపాదనకు పార్టీ అధిష్టానం కూడా అంగీకరించింది. క్రాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూనే విజయవాడ నుంచి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జూన్ వరకు ఆంధ్ర ఉద్యోగులను విజయవాడకు వచ్చేయాలని సూచించారు. విజయవాడ నుంచి పాలన కొనసాగుతుంటే హైదరాబాద్ నుంచి ఎపి కాంగ్రెస్ కార్యాలయాన్ని నడిపించడం బాగుండదని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించగా, మెజారిటీ నాయకులు ఆమోదం తెలిపారు. అధిష్టానం కూడా ఆమోదం తెలిపినందున జనవరి 1న విజయవాడలో ఎపి కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించుకుని, ఒక నెల రోజుల్లో ఇందిరా భవన్ నుంచి ఫర్నిచర్‌ను, ఇతరత్రా సామాగ్రిని మార్చాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇలాఉండగా ఎపి కాంగ్రెస్ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మారితే ఒక అంతస్తును గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముందస్తు బెయిల్ కోసం
మల్లాది విష్ణు దరఖాస్తు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 16: ఐదుగురి ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితునిగా ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపున ఓ న్యాయవాది బుధవారం విజయవాడ మెట్రోపాలిటన్ సెక్షన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించిన వారిలో ఐదుగురు చనిపోగా 29 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక బార్ యజమానులను అరెస్ట్ చేయాల్సి ఉంది. వృద్ధాప్యంలోనున్న లైసెన్స్‌దారు, విష్ణు తల్లి బాలాత్రిపుర సుందరమ్మను విచారించేందుకై సిట్ అధికారులు నోటీసులు పంపారు. అయితే నేటి వరకు విచారణకు హాజరుకాలేదు. బార్ నిర్వహణను తానే చూస్తున్నట్లుగా విష్ణు తమ్ముడు తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయాడు. విష్ణును ఎలాగైన అరెస్ట్ చేయాలన్న భావనలో పోలీసు కమిషనర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.