రాష్ట్రీయం

బాక్సైట్‌పై బాక్సింగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: అధికార, విపక్షాలు పరస్పరం కత్తులు దూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి వాడివేడిగా మొదలుకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమతమ పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశమై వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలపై కసరత్తు జరిపారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం-మృతుల వివాదంపై సర్కారుపై విరుచుకు పడేందుకు వైకాపా సిద్ధమవుతోంది. అలాగే, ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే టిడిపి పటిష్టమైన వ్యూహంతో ఉంది. గురువారం నుంచి 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు ఎప్పటిలాగే వ్యక్తిగత దూషణలు, విమర్శలు, పరస్పర దాడులతోనే ముగుస్తాయా లేక సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు ఆస్కారం ఇస్తాయా అన్నది వేచిచూడాల్సిందే.
ప్రజాసమస్యలను అర్ధవంతంగా చర్చించాలని, సభా సమయాన్ని వృథా చేయరాదని, అన్ని అంశాలను ప్రాధాన్యత ప్రకారం చర్చించేందుకు అధికార,ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఇప్పటికే ఇరు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై అధికార, విపక్ష పార్టీలు ఏకత్రాటిపైకి వచ్చి చర్చించి కేంద్రంపై వత్తిడి తెచ్చే విధంగా వ్యవహరిస్తాయా అన్నది అనుమానమే.
ప్రధానంగా కాల్‌మనీ వడ్డీవ్యాపారుల ఆగడాలు, సెక్స్ రాకెట్‌పై వైకాపా నోరుమెదపకుండా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. మనీ లాండరింగ్‌పై ఒక చట్టం తేవాలని, కాల్‌మనీపై రిటైర్డు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని నిర్ణయించడం ద్వారా అధికార పార్టీ కొంత మేర ప్రతిపక్ష దూకుడుకు కళ్లెం వేయగలిగింది. కాగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై వచ్చిన అభియోగాలను ప్రముఖంగా ప్రస్తావించాలని వైకాపా నిర్ణయించింది. బుధవారం ఇక్కడ వైకాపా అధ్యక్షుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని వదిలిపెట్టే ప్రసక్తిలేదని, కాల్‌మనీ రాకెట్, కల్తీ మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై కూడా వైకాపా దృష్టిని సారించింది.
కాగా, వైకాపాను కట్టడి చేసే బాధ్యతను మంత్రి అచ్చెంనాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఇంతవరకు కాల్‌మనీ రాకెట్‌లో 123 కేసులు నమోదు చేయగా 118 మందిని అరెస్టు చేశారు. ఇందులో వైకాపాకు చెందిన వారు 42 మంది ఉన్నారనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని టిడిపి నిర్ణయించింది. వైఎస్ హయాంలో జరిగిన మైక్రోఫైనాన్స్ వ్యవహారం, మద్యం సిండికేట్లలో మాజీ మంత్రి, ప్రస్తుత వైకాపా సీనియర్ నేత బొత్స కుటుంబ సభ్యుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించాలని టిడిపి వ్యూహంగా ఉంది. బాక్సైట్ వ్యవహారాన్ని వైకాపా రాజకీయం చేస్తోందని చెప్పేందుకు తగిన ఆధారాలతో టిడిపి సిద్ధమవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఐదు రోజుల శాసనసభ సమావేశాల్లో సభలో అందుబాటులో ఉండాలని అధికార, ప్రతిపక్షపార్టీ నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
శాసనమండలి సమావేశాలు
శాసనమండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలి సమావేశాల నిర్వహణ తీరును చైర్మన్ డాక్టర్ ఏ చక్రపాణి సమీక్షించారు. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు హాజరై భద్రతా ఏర్పాట్లను వివరించారు. గౌరవ సభ్యులకు ఎటువంటి అవరోధాలు లేకుండా సభను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చక్రపాణి తెలిపారు. ఈ సమావేశానికి ఎస్‌పిఎఫ్ డిజి తేజ్‌దీప్ కౌర్, అదనపు డిజిపి రే వినయ్ రంజన్, డిఐజి రామకృష్ణ, ఏపి శాసనసభ కార్యదర్శి కె సత్యనారాయణ రావు తదితరులు హాజరయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత
అసెంబ్లీ, శాసనమండలి ఐదు రోజుల శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు ఉమ్మడిగా కట్దుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటన జరగకుండా కీలకమైన ప్రదేశాల్లో గ్రేహౌండ్స్ బలగాలను మెహరించారు. అసెంబ్లీ నుంచి రెండు కి.మీ వరకు నిషేధాజ్ఞలను విధించారు.
బిఏసి సమావేశం
ఆంధ్ర అసెంబ్లీ బిఏసి సమావేశం ఉదయం 8.45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈసమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ హాజరవుతారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అజెండాను ఖరారు చేస్తారు. అసెంబ్లీని కనీసం పదిరోజుల పాటునిర్వహించాలని ఇప్పటికే వైకాపా డిమాండ్ చేసింది. అవసరమైతే ఒక రోజు 23వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 9.40 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది.