S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2019 - 04:22

హైదరాబాద్/విజయవాడ: ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చాలనుకోవడం సరైన ఆలోచన కాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వారం రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో యూరోప్ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.

06/26/2019 - 04:13

చిత్రం...ద్వాదశాదిత్య మహా గణపతిగా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ వినాయకుడి నమూనా

06/26/2019 - 04:03

హైదరాబాద్, జూన్ 25: ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో 13385 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 16న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను మంగళవారం నాడు విడుదల చేశారు. 17512 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 13385 మంది ఉత్తీర్ణులయ్యారని, ఇందులో 193 మంది ఖైదీలు కూడా ఉన్నారని వర్శిటీ అధికారులు తెలిపారు.

06/26/2019 - 04:01

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సీఎంతో ఉన్న 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సర్వే ప్రకటించింది. మొత్తం మంత్రివర్గంలో 88 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని పేర్కొంది. ఇందులో 17 మందిపైన వివిధ రకాలైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 65 శాతం మందికి నేరచరిత్ర ఉందని పేర్కొంది.

,
06/26/2019 - 04:45

విజయవాడ, జూన్ 25: దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మినహా మరో నాయకుడిని గుర్తించటం లేదని, మోదీ అడుగుజాడల్లో నడిచేందుకు నాయకులంతా ముందుకు వస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం బీజేపీలో చేరారు.

06/26/2019 - 01:19

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న ప్రగతిభవన్‌లో భేటీకి అజెండా ఖరారు అయింది. నీటిపారుదల రంగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, కోర్టులు, ట్రిబ్యునల్ కేసులను వెలుపల పరిష్కరించుకునే అంశంపై చర్చించనున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపిణీ, ఆర్థిక అంశాలపై చర్చిస్తారు.

06/26/2019 - 04:23

విజయవాడ: పోలీసింగ్‌లో పారదర్శకత, నిష్పాక్షికత తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మంగళవారం శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు.

06/26/2019 - 01:16

హైదరాబాద్, జూన్ 25: సుముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న గురువారం, దశమి ఉదయం 11 గంటల సమయానికి కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాల నిర్మాణాలకు భూమి పూజకు వాస్తుపండితులు ముహూర్తం ఖరారు చేశారు. భూమి పూజకు సచివాలయంలో డీ బ్లాక్‌కు వెనుక పొర్టికోకు ఎదురుగా ఉన్న లాన్స్‌ను, అసెంబ్లీ భవనానికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాలశాఖ ఇఎన్‌సి కార్యాలయ భవనానికి ఉత్తర దిశను ఎంపిక చేశారు.

06/26/2019 - 00:56

రాజమహేంద్రవరం, జూన్ 25: రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్టపై ప్రభుత్వ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమవుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారం గోదావరి నది ఒడిలో అక్రమార్కులకు గుబులురేపుతోంది.

06/26/2019 - 00:50

విజయవాడ, జూన్ 25: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేసే ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. జేసీబీలను, కూలీలను ప్రజావేదిక ప్రాంగణంలోకి తరలించారు. ఈ కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

Pages